- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 1 కొరింథీయులకు 3:21సుమారు క్రీ.శ. 59
కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే.
- 1 కొరింథీయులకు 3:22సుమారు క్రీ.శ. 59
పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే.
- 1 కొరింథీయులకు 3:23సుమారు క్రీ.శ. 59
మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.
- 1 కొరింథీయులకు 4:1సుమారు క్రీ.శ. 59
అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.
- 1 కొరింథీయులకు 4:2సుమారు క్రీ.శ. 59
ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము.
- 1 కొరింథీయులకు 4:3సుమారు క్రీ.శ. 59
మీ చేత గాని ఇతరులచేత గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్న విషయము. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను.
- 1 కొరింథీయులకు 4:4సుమారు క్రీ.శ. 59
నా మనస్సాక్షి నిర్దోషమైనది, అయినా నేను నిర్దోషి అని కాదు నన్ను తీర్పు తీర్చేది ప్రభువే.
- 1 కొరింథీయులకు 4:5సుమారు క్రీ.శ. 59
అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.
- 1 కొరింథీయులకు 4:6సుమారు క్రీ.శ. 59
సహోదరీ సహోదరులారా, “వ్రాయబడిన వాటిని మించి వెళ్లవద్దు” అని చెప్పబడిన మాట భావాన్ని మా నుండి మీరు నేర్చుకోగలిగేలా, మీకు మేలు కలుగడానికి ఈ విషయాలను నా గురించి అపొల్లో గురించి ఉదాహరణగా చెప్పాను. అప్పుడు మమ్మల్ని అనుసరించే వారిగా మీరు ఒకరిపై ఒకరు అతిశయపడకుండా ఉంటారు.
- 1 కొరింథీయులకు 4:7సుమారు క్రీ.శ. 59
ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల నుండి నీవు పొందనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు ఇతరుల నుండి పొంది కూడా పొందని వానిలా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?
- 1 కొరింథీయులకు 4:8సుమారు క్రీ.శ. 59
ఇప్పటికే మీకు కావలసినవన్ని మీరు కలిగి ఉన్నారు! మీరు ధనవంతులైయ్యారు! మేము లేకుండానే మీరు పరిపాలించడం ప్రారంభించారు! మేము కూడా మీతో కలిసి పరిపాలించేలా మీరు నిజంగా పరిపాలించడం నాకు సంతోషమే!
- 1 కొరింథీయులకు 4:9సుమారు క్రీ.శ. 59
దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము.
- 1 కొరింథీయులకు 4:10సుమారు క్రీ.శ. 59
మేము క్రీస్తు కోసం బుద్ధిహీనులం, కాని మీరు క్రీస్తులో తెలివైనవారు! మేము బలహీనులం, కాని మీరు బలవంతులు! మీరు గౌరవం పొందారు, మేము అవమానం పొందాం!
- 1 కొరింథీయులకు 4:11సుమారు క్రీ.శ. 59
ఈ సమయం వరకు ఆకలిదప్పులతో అలమటించాము, చింపిరి గుడ్డలతో ఉన్నాము, క్రూరంగా కొట్టబడ్డాము, నిరాశ్రయులుగా ఉన్నాము.
- 1 కొరింథీయులకు 4:12సుమారు క్రీ.శ. 59
మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాము. మమ్మల్ని శపించినవారిని మేము దీవిస్తున్నాము; మమ్మల్ని హింసించినప్పుడు ఓర్చుకుంటున్నాము,
- 1 కొరింథీయులకు 4:13సుమారు క్రీ.శ. 59
మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాము. ఇప్పటివరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాము.
- 1 కొరింథీయులకు 4:14సుమారు క్రీ.శ. 59
మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలుగా మిమ్మల్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను.
- 1 కొరింథీయులకు 4:15సుమారు క్రీ.శ. 59
క్రీస్తులో మీకు పదివేలమంది ఉపదేశకులు ఉన్నా, తండ్రులు అనేకులు లేరు. కాబట్టి క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మీకు తండ్రినయ్యాను.
- 1 కొరింథీయులకు 4:16సుమారు క్రీ.శ. 59
కాబట్టి, నన్ను అనుకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
- 1 కొరింథీయులకు 4:17సుమారు క్రీ.శ. 59
ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసు క్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.
- 1 కొరింథీయులకు 4:18సుమారు క్రీ.శ. 59
నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు.
- 1 కొరింథీయులకు 4:19సుమారు క్రీ.శ. 59
అయితే, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. ఆ గర్విష్ఠులు మాట్లాడే మాటలనే కాకుండా వారికి ఏ శక్తి ఉందో తెలుసుకుంటాను.
- 1 కొరింథీయులకు 4:20సుమారు క్రీ.శ. 59
దేవుని రాజ్యం అంటే వట్టిమాటలు కాదు అది శక్తితో కూడింది.
- 1 కొరింథీయులకు 4:21సుమారు క్రీ.శ. 59
మీరేది కోరుతున్నారు? నేను మీ దగ్గరకు క్రమశిక్షణ అనే బెత్తంతో రావాలా? లేదా నేను ప్రేమతో సౌమ్యమైన మనస్సుతో రావాలా?
- 1 కొరింథీయులకు 5:1సుమారు క్రీ.శ. 59
మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.