Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మొర్దెకై తన ఎదుట మోకరించడం లేదని, గౌరవించడం లేదని చూసి హామానుకు చాలా కోపం వచ్చింది.

  2. అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.

  3. నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!

  4. అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, నేను మీకేమి తీసిపోను. ఈ విషయాలు తెలియనివారు ఎవరు?

  5. మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను.

  6. మీరందరు మౌనంగా ఉంటే మంచిది, మీకు అదే జ్ఞానము.

  7. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:

  8. “జ్ఞానం కలవారు వ్యర్థమైన తెలివితో సమాధానం ఇస్తారా? తూర్పు గాలితో తమ కడుపు నింపుకొంటారా?

  9. పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా?

  10. నీవు భక్తిని విడిచిపెట్టి దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు.

  11. నీ నోరు నీ పాపాలను తెలియజేస్తుంది; కపటంగా మాట్లాడేవారిలా నీవు మాట్లాడుతున్నావు.

  12. నేను కాదు, నీ నోరే నిన్ను ఖండిస్తుంది; నీ పెదవులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి.

  13. “నీవేమైన మొదట పుట్టిన పురుషునివా? కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా?

  14. దేవుని ఆలోచనసభలో నీవు ఉన్నావా? జ్ఞానం నీకొక్కడికే సొంతమా?

  15. నీకు తెలిసినది మాకు తెలియనిది ఏమిటి? నీవు గ్రహించగలిగింది మేము గ్రహించలేనిది ఏమిటి?

  16. తల నెరసినవారు వృద్ధులైనవారు మా వైపు ఉన్నారు, వారు వయస్సులో నీ తండ్రి కంటే పెద్దవారు.

  17. దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా? ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా?

  18. దేవుని మీద కోప్పడి, ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా, నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి?

  19. That thou turnest thy spirit against God, and lettest such words go out of thy mouth?

  20. నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?

  21. కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?

  22. వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు?

  23. వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.

  24. కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.

  25. కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; నాకు తెలిసింది మీకు చెప్తాను.