Pride గురించి బైబిల్ వచనాలు: Punished
Punished గురించి వచనాలు
ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.
ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.
“తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది; అది మండుతున్న కొలిమిలా ఉంటుంది. గర్విష్ఠులందరూ, కీడుచేసే ప్రతివాడు ఎండుగడ్డిలా ఉంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు, వారికి వేరు గాని, కొమ్మ గాని మిగలదు.