Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు.

  2. అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.

  3. వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.

  4. కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.

  5. దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.

  6. యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు.

  7. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.

  8. యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

  9. అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.

  10. “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి.

  11. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.

  12. క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.

  13. గర్వము వెంబడి అవమానం వస్తుంది, కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.

  14. తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు, కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు.

  15. ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.

  16. మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు.

  17. గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.

  18. తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు, బీదలకు దయ చూపేవాడు ధన్యుడు.

  19. మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.

  20. దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.

  21. ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు.

  22. గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును.

  23. క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు, అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు.

  24. గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు.

  25. నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.