Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది మానవుల గర్వం తగ్గించబడుతుంది; ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.

  2. యెహోవా ఇలా అంటున్నారు, “సీయోను స్త్రీలు గర్విష్ఠులు వారు మెడలు చాచి నడుస్తూ ఓర చూపులు చూస్తూ ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు.

  3. కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”

  4. ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,

  5. చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,

  6. తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,

  7. ఉంగరాలు, ముక్కుపుడకలు,

  8. పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు,

  9. అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.

  10. సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.

  11. మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.

  12. సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.

  13. చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

  14. మనుష్యులు అణగద్రొక్కబడతారు. అందరు తగ్గించబడతారు, గర్విష్ఠుల చూపు తగ్గించబడుతుంది.

  15. గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.

  16. “ఇటుకలు పడిపోయాయి, కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; రావి చెట్లు నరకబడ్డాయి, వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.

  17. అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.

  18. దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను, దోచుకోడానికి కొల్లగొట్టడానికి, వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికి నాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను.

  19. అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు, ఇది అతని మనస్సులో ఉన్నది అది కాదు. నాశనం చేయాలని, చాలా దేశాలను నిర్మూలించాలన్నది అతని ఉద్దేశము.

  20. అతడు, “నా అధిపతులందరు రాజులు కారా?

  21. కల్నో, కర్కెమీషులా ఉండలేదా? హమాతు అర్పదులా ఉండలేదా సమరయ దమస్కులా ఉండలేదా?

  22. విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.

  23. నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు యెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?”

  24. ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.

  25. ఎందుకంటే అతడు ఇలా అన్నాడు: “ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత, నా జ్ఞానంతో దీన్ని చేశాను. నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను, వారి సంపదలు దోచుకున్నాను; బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.