కంటెంట్‌కు వెళ్లండి

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను.

  3. వినండి శ్రద్ధ వహించండి, గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.

  4. మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.

  5. హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.

  6. మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.

  7. “ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?

  8. మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి; దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

  9. “మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.

  10. మీ లోయలు చాలా ఫలవంతమైనవి, అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె, నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి, ‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు.

  11. నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  12. “బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది.

  13. సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నీ శ్రమ దినం వచ్చింది, నీవు శిక్షించబడే సమయం వచ్చింది.

  14. గర్విష్ఠులు తడబడి పడిపోతారు ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు. నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.”

  15. నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు,

  16. “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

  17. నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?

  18. నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

  19. వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.

  20. “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ ‘దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు కాబట్టి,

  21. నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

  22. వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.

  23. నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.

  24. నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

  25. “ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, దాని బల గర్వం అణిగిపోతుంది. మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.