Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”

  2. గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!

  3. కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా, అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు; వారి మహిమను కాల్చడానికి వారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది.

  4. దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.

  5. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?

  6. నీవు నీ హృదయంలో, “నేను ఆకాశాలను ఎక్కుతాను; దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను; ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, సాఫోన్ పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.

  7. మేఘ మండలం మీదికి ఎక్కుతాను. నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు.

  8. కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో లోతైన గోతిలో త్రోయబడ్డావు.

  9. నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ నీ విధి గురించి ఇలా అనుకుంటారు: “భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించింది ఇతడేనా?

  10. మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే.

  11. కాబట్టి మోయాబీయులు రోదిస్తారు, వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు. కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్ల విలపించి దుఃఖిస్తారు.

  12. నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?

  13. నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ హోదా నుండి త్రోసివేయబడతావు.

  14. మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? పాతది, ప్రాచీన పట్టణం, దూరదేశంలో నివసించడానికి సుదూర ప్రయాణం చేసింది ఇదేనా?

  15. తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.

  16. భూమి ఎండిపోయి వాడిపోతుంది, లోకం క్షీణించి వాడిపోతుంది, ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.

  17. ఆ రోజున యెహోవా పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.

  18. ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.

  19. ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ.

  20. ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం కాళ్లతో త్రొక్కబడుతుంది.

  21. నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

  22. “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను.

  23. ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.

  24. నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.

  25. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,