Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.

  2. తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.

  3. ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.

  4. నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.

  5. తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?

  6. అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.

  7. అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.

  8. బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.

  9. తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు.

  10. వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.

  11. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.

  12. కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.

  13. నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.

  14. ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు; వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.

  15. దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.

  16. ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు.

  17. గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.

  18. తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;

  19. అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం;

  20. మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.

  21. సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి),

  22. ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,

  23. పెద్ద పర్వతాలన్నిటికి, ఎత్తైన కొండలన్నిటికి

  24. ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు,

  25. ప్రతీ వాణిజ్య నౌకకు మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.