Skip to content

Pride గురించి బైబిల్ వచనాలు

303 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; నేను మీ అభిప్రాయాలను విన్నాను,

  2. మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.

  3. మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.

  4. కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.”

  5. యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. సెలా

  6. దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.

  7. వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.

  8. దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.

  9. వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.

  10. “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

  11. “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

  12. పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.

  13. “మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు.

  14. మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు.

  15. యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు.

  16. గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.

  17. వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి సమాధే వారి నిత్య నివాసము అక్కడే వారు నిత్యం నివసిస్తారు.

  18. “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”

  19. కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు.

  20. వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు.

  21. వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి.

  22. అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.

  23. ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.

  24. తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

  25. రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.