కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 34:14సుమారు క్రీ.పూ. 1452

    ఎందుకంటే రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే అర్థగోత్రం, తమ తమ కుటుంబాలు వారసత్వం పొందారు.

  2. సంఖ్యాకాండము 34:15సుమారు క్రీ.పూ. 1452

    ఈ రెండున్నర గోత్రాల వారు యెరికోకు తూర్పున యొర్దానుకు అవతలి వైపు, సూర్యోదయం వైపున ఉన్న భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు.”

  3. సంఖ్యాకాండము 34:16సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేతో అన్నారు,

  4. సంఖ్యాకాండము 34:17సుమారు క్రీ.పూ. 1452

    “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ.

  5. సంఖ్యాకాండము 34:18సుమారు క్రీ.పూ. 1452

    భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు.

  6. సంఖ్యాకాండము 34:19సుమారు క్రీ.పూ. 1452

    “వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;

  7. సంఖ్యాకాండము 34:20సుమారు క్రీ.పూ. 1452

    షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;

  8. సంఖ్యాకాండము 34:21సుమారు క్రీ.పూ. 1452

    బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు;

  9. సంఖ్యాకాండము 34:22సుమారు క్రీ.పూ. 1452

    దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు;

  10. సంఖ్యాకాండము 34:23సుమారు క్రీ.పూ. 1452

    యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;

  11. సంఖ్యాకాండము 34:24సుమారు క్రీ.పూ. 1452

    ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు;

  12. సంఖ్యాకాండము 34:25సుమారు క్రీ.పూ. 1452

    జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు;

  13. సంఖ్యాకాండము 34:26సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు;

  14. సంఖ్యాకాండము 34:27సుమారు క్రీ.పూ. 1452

    ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు;

  15. సంఖ్యాకాండము 34:28సుమారు క్రీ.పూ. 1452

    నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.”

  16. సంఖ్యాకాండము 34:29సుమారు క్రీ.పూ. 1452

    కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.

  17. సంఖ్యాకాండము 35:1సుమారు క్రీ.పూ. 1451

    మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు,

  18. సంఖ్యాకాండము 35:2సుమారు క్రీ.పూ. 1451

    “ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి.

  19. సంఖ్యాకాండము 35:3సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి.

  20. సంఖ్యాకాండము 35:4సుమారు క్రీ.పూ. 1451

    “లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల దూరంలో ఉంటుంది.

  21. సంఖ్యాకాండము 35:5సుమారు క్రీ.పూ. 1451

    పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు.

  22. సంఖ్యాకాండము 35:6సుమారు క్రీ.పూ. 1451

    “లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి.

  23. సంఖ్యాకాండము 35:7సుమారు క్రీ.పూ. 1451

    మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి.

  24. సంఖ్యాకాండము 35:8సుమారు క్రీ.పూ. 1451

    ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.”

  25. సంఖ్యాకాండము 35:9సుమారు క్రీ.పూ. 1451

    తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు: