- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 35:10సుమారు క్రీ.పూ. 1451
“ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,
- సంఖ్యాకాండము 35:11సుమారు క్రీ.పూ. 1451
కొన్ని పట్టణాలను ఆశ్రయపురాలుగా ఎన్నుకోండి. ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
- సంఖ్యాకాండము 35:12సుమారు క్రీ.పూ. 1451
ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు.
- సంఖ్యాకాండము 35:13సుమారు క్రీ.పూ. 1451
ఈ ఆరు పట్టణాలు మీ ఆశ్రయ పట్టణాలుగా ఉంటాయి.
- సంఖ్యాకాండము 35:14సుమారు క్రీ.పూ. 1451
మూడు యొర్దానుకు ఇటువైపు, మూడు కనాను దేశంలో ఆశ్రయపురాలుగా ఇవ్వాలి.
- సంఖ్యాకాండము 35:15సుమారు క్రీ.పూ. 1451
ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
- సంఖ్యాకాండము 35:16సుమారు క్రీ.పూ. 1451
“ ‘ఎవరైనా ఇనుప వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
- సంఖ్యాకాండము 35:17సుమారు క్రీ.పూ. 1451
లేదా ఒకవేళ ఎవరైనా ఒక రాయితో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
- సంఖ్యాకాండము 35:18సుమారు క్రీ.పూ. 1451
లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
- సంఖ్యాకాండము 35:19సుమారు క్రీ.పూ. 1451
పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.
- సంఖ్యాకాండము 35:20సుమారు క్రీ.పూ. 1451
ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే
- సంఖ్యాకాండము 35:21సుమారు క్రీ.పూ. 1451
లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు.
- సంఖ్యాకాండము 35:22సుమారు క్రీ.పూ. 1451
“ ‘అయితే ఎవరైనా శత్రుత్వం లేకుండ ఎవరినైన అకస్మాత్తుగా నెట్టినా, లేదా వారివైపు అనుకోకుండ ఏదైనా విసిరినా,
- సంఖ్యాకాండము 35:23సుమారు క్రీ.పూ. 1451
లేదా చూడకుండ బరువైన రాయి వేసినా, వారు చనిపోతే, వేసినవానికి వారు శత్రువు కాదు హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి,
- సంఖ్యాకాండము 35:24సుమారు క్రీ.పూ. 1451
సమాజం నిందితునికి, పగతీర్చుకునే వానికి మధ్య ఉండి ఈ చట్టాల ప్రకారం తీర్పు తీర్చాలి.
- సంఖ్యాకాండము 35:25సుమారు క్రీ.పూ. 1451
సమాజం ఆ నిందితుడిని పగతీర్చుకునే వాని నుండి కాపాడి తిరిగి అతడు పారిపోయిన ఆశ్రయపురానికి పంపించాలి. నిందితుడు పరిశుద్ధ నూనెతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండాలి.
- సంఖ్యాకాండము 35:26సుమారు క్రీ.పూ. 1451
“ ‘ఒకవేళ నిందితుడు తాను వెళ్లిన ఆశ్రయపురం నుండి బయటకు వెళ్తే,
- సంఖ్యాకాండము 35:27సుమారు క్రీ.పూ. 1451
పగ తీర్చుకునేవాడు అతన్ని ఆశ్రయపురం బయట చూస్తే, అతన్ని చంపవచ్చు, అది హత్యగా లెక్కించబడదు.
- సంఖ్యాకాండము 35:28సుమారు క్రీ.పూ. 1451
ప్రధాన యాజకుడు చనిపోయే వరకు నిందితుడు ఆశ్రయపురం లోనే ఉండాలి. ఆ తర్వాత అతడు తన స్వస్థలానికి వెళ్లిపోవచ్చు.
- సంఖ్యాకాండము 35:29సుమారు క్రీ.పూ. 1451
“ ‘ఇది మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలలో మీ కోసం చట్టబద్ధమైన నియమంగా ఉంటుంది.
- సంఖ్యాకాండము 35:30సుమారు క్రీ.పూ. 1451
“ ‘సాక్షుల నోటి మాటను బట్టి హంతకులు మరణశిక్ష పొందుతారు. అయితే ఒక్క సాక్షి సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించబడకూడదు.
- సంఖ్యాకాండము 35:31సుమారు క్రీ.పూ. 1451
“ ‘శిక్ష పొందాల్సిన హంతకుల జీవితం కోసం విమోచన క్రయధనం స్వీకరించకూడదు. వారు మరణశిక్ష పొందాలి.
- సంఖ్యాకాండము 35:32సుమారు క్రీ.పూ. 1451
“ ‘ఆశ్రయపురానికి పారిపోయినవారి నుండి విమోచన క్రయధనం స్వీకరించకూడదు, ప్రధాన యాజకుడు చనిపోకముందు వారిని తమ స్వస్థలానికి పంపించవద్దు.
- సంఖ్యాకాండము 35:33సుమారు క్రీ.పూ. 1451
“ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము.
- సంఖ్యాకాండము 35:34సుమారు క్రీ.పూ. 1451
మీరు నివసించే, నేను నివసించే భూమిని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే, యెహోవానైన నేను, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను.’ ”