కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 1:13సుమారు క్రీ.పూ. 1451

    ప్రతి గోత్రంలో నుండి జ్ఞాన వివేకాలు కలిగిన పురుషులను ఎంపిక చేయండి, నేను వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.

  2. ద్వితీయోపదేశకాండము 1:14సుమారు క్రీ.పూ. 1451

    అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు.

  3. ద్వితీయోపదేశకాండము 1:15సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.

  4. ద్వితీయోపదేశకాండము 1:16సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.

  5. ద్వితీయోపదేశకాండము 1:17సుమారు క్రీ.పూ. 1451

    తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.

  6. ద్వితీయోపదేశకాండము 1:18సుమారు క్రీ.పూ. 1451

    మీరు చేయవలసిందంతా ఆ సమయంలో నేను మీకు చెప్పాను.

  7. ద్వితీయోపదేశకాండము 1:19సుమారు క్రీ.పూ. 1451

    తర్వాత మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ప్రకారం, హోరేబు నుండి బయలుదేరి మీరు చూసిన భయంకరమైన మహారణ్యం గుండా వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం ద్వారా ప్రయాణించి కాదేషు బర్నియాకు చేరుకున్నాము.

  8. ద్వితీయోపదేశకాండము 1:20సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకు ఇస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు చేరుకున్నారు.

  9. ద్వితీయోపదేశకాండము 1:21సుమారు క్రీ.పూ. 1451

    చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి” అని చెప్పాను.

  10. ద్వితీయోపదేశకాండము 1:22సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు మీరందరు నా దగ్గరకు వచ్చి, “ఆ దేశంలో గూఢచర్యం చేసి మనం వెళ్లవలసిన దారి, మనం వెళ్లే పట్టణాల గురించి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కొంతమందిని పంపుదాం” అన్నారు.

  11. ద్వితీయోపదేశకాండము 1:23సుమారు క్రీ.పూ. 1451

    ఈ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి మీలో ప్రతి గోత్రం నుండి ఒకరు చొప్పున పన్నెండుమందిని పంపాను.

  12. ద్వితీయోపదేశకాండము 1:24సుమారు క్రీ.పూ. 1451

    వారు అక్కడినుండి కొండ ప్రాంతానికి ఎక్కి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు.

  13. ద్వితీయోపదేశకాండము 1:25సుమారు క్రీ.పూ. 1451

    వారు ఆ దేశపు పండ్లు కొన్ని మన దగ్గరకు తెచ్చి, “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని చెప్పారు.

  14. ద్వితీయోపదేశకాండము 1:26సుమారు క్రీ.పూ. 1451

    కాని మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు; మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు.

  15. ద్వితీయోపదేశకాండము 1:27సుమారు క్రీ.పూ. 1451

    మీ గుడారాల్లో సణుగుతూ, “యెహోవా మనలను ద్వేషించి మనలను నాశనం చేయడానికి అమోరీయుల చేతికి మనలను అప్పగించడానికి ఈజిప్టు నుండి మనలను బయటకు తీసుకువచ్చారు.

  16. ద్వితీయోపదేశకాండము 1:28సుమారు క్రీ.పూ. 1451

    మనం ఎక్కడికి వెళ్లగలం? మన సహోదరులు, ‘అక్కడి ప్రజలు మనకన్నా బలవంతులు, పొడవైనవారు; ఆ పట్టణాలు ఎంతో పెద్దవిగా ఆకాశమంత ఎత్తైన గోడలతో ఉన్నాయి; అక్కడ అనాకీయులను కూడా చూశాం’ అని చెప్పి మా గుండెలు భయంతో చెదిరిపోయేలా చేశారు” అన్నారు.

  17. ద్వితీయోపదేశకాండము 1:29సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు నేను మీతో, “దిగులుపడకండి, వారికి భయపడకండి.

  18. ద్వితీయోపదేశకాండము 1:30సుమారు క్రీ.పూ. 1451

    మీకు ముందుగా నడుస్తున్న మీ దేవుడైన యెహోవా మీ కళ్ళెదుట ఈజిప్టులోను అరణ్యంలోను మీ కోసం చేసినట్లు ఆయన మీ కోసం యుద్ధం చేస్తారు,

  19. ద్వితీయోపదేశకాండము 1:31సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈ స్థలానికి చేరుకునేవరకు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ మార్గమంతటిలో మిమ్మల్ని ఎలా ఎత్తుకుని వచ్చారో మీరు చూశారు” అని అన్నాను.

  20. ద్వితీయోపదేశకాండము 1:32సుమారు క్రీ.పూ. 1451

    ఇంత చెప్పినా, మీ ప్రయాణమంతటిలో మీరు బస కోసం చోటు వెదకడానికి, మీరు వెళ్లవలసిన మార్గాన్ని మీకు చూపించడానికి రాత్రివేళ అగ్నిలో, పగటివేళ మేఘంలో మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు నమ్మకం ఉంచలేదు.

  21. ద్వితీయోపదేశకాండము 1:33సుమారు క్రీ.పూ. 1451

    Who went in the way before you, to search you out a place to pitch your tents in, in fire by night, to shew you by what way ye should go, and in a cloud by day.

  22. ద్వితీయోపదేశకాండము 1:34సుమారు క్రీ.పూ. 1451

    మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నప్పుడు ఆయన కోపంతో, కాబట్టి ఆయన ప్రమాణ చేస్తూ,

  23. ద్వితీయోపదేశకాండము 1:35సుమారు క్రీ.పూ. 1451

    “నేను మీ పూర్వికులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో

  24. ద్వితీయోపదేశకాండము 1:36సుమారు క్రీ.పూ. 1451

    యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడరు. అతడు హృదయమంతటితో యెహోవాను అనుసరించాడు కాబట్టి దానిని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశాన్ని అతనికి, అతని సంతానానికి నేను ఇస్తాను” అని ప్రమాణం చేశారు.

  25. ద్వితీయోపదేశకాండము 1:37సుమారు క్రీ.పూ. 1451

    మీ కారణంగా యెహోవా నా మీద కూడా కోప్పడి, “నీవు కూడా ఆ దేశంలో అడుగుపెట్టవు.