- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Moses & The Exodus
God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 12:42సుమారు క్రీ.పూ. 1491
ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి ఆ రాత్రి యెహోవా మెళకువగా ఉన్నందున, ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇశ్రాయేలీయులందరు రాబోయే తరాల కోసం ప్రభువును గౌరవించడానికి మెలకువగా ఉండాలి.
- నిర్గమకాండము 12:43సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు.
- నిర్గమకాండము 12:44సుమారు క్రీ.పూ. 1491
మీరు వెండి పెట్టి కొన్న బానిసకు మీరు సున్నతి చేసిన తర్వాత అతడు దీనిని తినవచ్చు,
- నిర్గమకాండము 12:45సుమారు క్రీ.పూ. 1491
తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు.
- నిర్గమకాండము 12:46సుమారు క్రీ.పూ. 1491
“దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు.
- నిర్గమకాండము 12:47సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలీయుల సమాజమంతా దీనిని ఆచరించాలి.
- నిర్గమకాండము 12:48సుమారు క్రీ.పూ. 1491
“మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.
- నిర్గమకాండము 12:49సుమారు క్రీ.పూ. 1491
దీని గురించి స్వదేశీయులకు మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఒకే నియమం వర్తిస్తుంది.”
- నిర్గమకాండము 12:50సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలీయులందరు చేశారు.
- నిర్గమకాండము 12:51సుమారు క్రీ.పూ. 1491
అదే రోజు యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి విభజనల ప్రకారం ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.
- నిర్గమకాండము 13:1సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
- నిర్గమకాండము 13:2సుమారు క్రీ.పూ. 1491
“ప్రతీ మొదటి మగ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి. ఇశ్రాయేలీయుల మనుష్యుల్లోనైనా పశువుల్లోనైనా ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే.”
- నిర్గమకాండము 13:3సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు.
- నిర్గమకాండము 13:4సుమారు క్రీ.పూ. 1491
అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు.
- నిర్గమకాండము 13:5సుమారు క్రీ.పూ. 1491
యెహోవా కనానీయుల హిత్తీయుల అమోరీయుల హివ్వీయుల యెబూసీయుల దేశం మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు ఈ నెలలో మీరు ఈ సేవలు జరిగించాలి.
- నిర్గమకాండము 13:6సుమారు క్రీ.పూ. 1491
ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజున యెహోవాకు పండుగ చేయాలి.
- నిర్గమకాండము 13:7సుమారు క్రీ.పూ. 1491
ఈ ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి; పులిసినదేది మీ మధ్య కనపడకూడదు. మీ సరిహద్దుల లోపల ఎక్కడా పులిసినది కనపడకూడదు.
- నిర్గమకాండము 13:8సుమారు క్రీ.పూ. 1491
ఆ రోజున, ‘నేను ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని బట్టి నేను ఇది చేస్తున్నాను’ అని నీ కుమారునితో చెప్పాలి.
- నిర్గమకాండము 13:9సుమారు క్రీ.పూ. 1491
యెహోవా తన బలమైన హస్తంతో మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీ నోటిలో ఉండేలా ఈ సంస్కారం మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక జ్ఞాపకంగా ఉంటుంది.
- నిర్గమకాండము 13:10సుమారు క్రీ.పూ. 1491
ప్రతి సంవత్సరం నిర్ణయ కాలంలో మీరు ఈ సంస్కారాన్ని ఆచరించాలి.
- నిర్గమకాండము 13:11సుమారు క్రీ.పూ. 1491
“యెహోవా మీకు మీ పూర్వికులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన ప్రకారం కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి దానిని మీకు ఇచ్చిన తర్వాత,
- నిర్గమకాండము 13:12సుమారు క్రీ.పూ. 1491
ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.
- నిర్గమకాండము 13:13సుమారు క్రీ.పూ. 1491
ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి.
- నిర్గమకాండము 13:14సుమారు క్రీ.పూ. 1491
“భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.
- నిర్గమకాండము 13:15సుమారు క్రీ.పూ. 1491
ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’