- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Moses & The Exodus
God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 11:2సుమారు క్రీ.పూ. 1491
పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.”
- నిర్గమకాండము 11:3సుమారు క్రీ.పూ. 1491
యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈజిప్టువారికి కనికరం కలిగేలా చేశారు, అంతేకాక మోషే ఈజిప్టు దేశంలో ఫరో అధికారులచేత ప్రజలచేత గొప్పగా గౌరవించబడ్డాడు.
- నిర్గమకాండము 11:4సుమారు క్రీ.పూ. 1491
మోషే ఫరోతో, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశం గుండా వెళ్తాను.
- నిర్గమకాండము 11:5సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి.
- నిర్గమకాండము 11:6సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు ఈజిప్టు దేశమంతటా పెద్ద రోదన ఉంటుంది. అటువంటి రోదన గతంలో ఎప్పుడూ లేదు ఇకముందు ఉండదు.
- నిర్గమకాండము 11:7సుమారు క్రీ.పూ. 1491
అయితే ఇశ్రాయేలీయులలో ఏ వ్యక్తిని చూసి కానీ లేదా జంతువును చూసి గాని ఒక కుక్క కూడా మొరుగదు.’ అప్పుడు యెహోవా ఈజిప్టు, ఇశ్రాయేలు మధ్య భేదం చూపించారని మీకు తెలుస్తుంది.
- నిర్గమకాండము 11:8సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.
- నిర్గమకాండము 11:9సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశంలో నా అద్భుతాలు అధికమయ్యేలా ఫరో నీ మాట వినడం తృణీకరిస్తాడు” అన్నారు.
- నిర్గమకాండము 11:10సుమారు క్రీ.పూ. 1491
మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ అద్భుతాలన్నిటిని చేశారు, కాని యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు కాబట్టి అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వలేదు.
యెహోవా మోషే అహరోనులతో ఈజిప్టులో ఇలా అన్నారు,
- నిర్గమకాండము 12:2సుమారు క్రీ.పూ. 1491
“ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల.
- నిర్గమకాండము 12:3సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలీయుల సమాజమంతటికి చెప్పండి, ఈ నెల పదవ రోజున ప్రతి మనిషి తన కుటుంబానికి ఒక గొర్రెను తీసుకోవాలి, ప్రతి ఇంటికి ఒకటి.
- నిర్గమకాండము 12:4సుమారు క్రీ.పూ. 1491
ఆ గొర్రెపిల్ల మొత్తాన్ని తినడానికి ఒకవేళ కుటుంబం మరీ చిన్నగా ఉంటే, దానిని తమకు అతి దగ్గరగా ఉన్న పొరుగువారితో, అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ లెక్కను పరిగణలోకి దానిని పంచుకోవాలి. ప్రతి ఒక్కరు తినే పరిమాణం బట్టి మీరు గొర్రెపిల్లను ఎంచుకోవాలి.
- నిర్గమకాండము 12:5సుమారు క్రీ.పూ. 1491
మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి.
- నిర్గమకాండము 12:6సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలు సమాజంలోని సభ్యులందరు సంధ్య సమయంలో వాటిని వధించవలసిన నెల పద్నాలుగవ రోజు వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి.
- నిర్గమకాండము 12:7సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు వారు దాని రక్తంలో కొంచెం తీసుకుని తాము గొర్రెపిల్లలను తినే వారి ఇళ్ళ ద్వారబంధాలకు రెండు పలకల మీద పూయాలి.
- నిర్గమకాండము 12:8సుమారు క్రీ.పూ. 1491
ఆ రాత్రే వారు అగ్నిలో కాల్చబడిన ఆ మాంసాన్ని చేదు మూలికలతో, పులియని రొట్టెలతో తినాలి.
- నిర్గమకాండము 12:9సుమారు క్రీ.పూ. 1491
ఆ మాంసాన్ని పచ్చిగా గాని లేదా నీళ్లలో ఉడకబెట్టి గాని తినకూడదు, అయితే దాని తల, కాళ్లు, లోపలి భాగాలను అగ్నిలో కాల్చి తినాలి.
- నిర్గమకాండము 12:10సుమారు క్రీ.పూ. 1491
దానిలో దేన్ని కూడా ఉదయం వరకు మిగిలించకూడదు; ఉదయం వరకు దానిలో ఏమైనా మిగిలితే, దానిని మీరు కాల్చివేయాలి.
- నిర్గమకాండము 12:11సుమారు క్రీ.పూ. 1491
దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి.
- నిర్గమకాండము 12:12సుమారు క్రీ.పూ. 1491
“అదే రాత్రి నేను ఈజిప్టు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుష్యుల్లో జంతువుల్లో ప్రతి మొదటి సంతానాన్ని చంపి ఈజిప్టు దేవుళ్ళందరికి తీర్పు తీరుస్తాను. నేను యెహోవానై యున్నాను.
- నిర్గమకాండము 12:13సుమారు క్రీ.పూ. 1491
మీరున్న ఇళ్ళ మీద ఉన్న రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు, మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఈజిప్టును మొత్తినప్పుడు ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.
- నిర్గమకాండము 12:14సుమారు క్రీ.పూ. 1491
“ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి.
- నిర్గమకాండము 12:15సుమారు క్రీ.పూ. 1491
ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి.
- నిర్గమకాండము 12:16సుమారు క్రీ.పూ. 1491
మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, ఏడవ రోజు మరొకటి నిర్వహించాలి. ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తినడానికి ఆహారం సిద్ధం చేయడం తప్ప పనులేవీ చేయకూడదు.