- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Moses & The Exodus
God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 10:6సుమారు క్రీ.పూ. 1491
నీ ఇల్లు నీ అధికారులందరి ఇల్లు ఈజిప్టు వారందరి ఇల్లు వాటితో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు గాని మీ పూర్వికులు గాని వారు ఈ దేశంలో స్థిరపడినప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి వాటిని ఎన్నడూ చూడలేదు.’ ” తర్వాత మోషే ఫరో దగ్గర నుండి తిరిగి వచ్చేశాడు.
- నిర్గమకాండము 10:7సుమారు క్రీ.పూ. 1491
ఫరో అధికారులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకి ఉరిగా ఉంటాడు? ఈ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించడానికి వారిని వెళ్లనివ్వు. ఈజిప్టు నాశనం చేయబడుతుందని నీవు గ్రహించవా?” అని అన్నారు.
- నిర్గమకాండము 10:8సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు.
- నిర్గమకాండము 10:9సుమారు క్రీ.పూ. 1491
అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.
- నిర్గమకాండము 10:10సుమారు క్రీ.పూ. 1491
అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు.
- నిర్గమకాండము 10:11సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు.
- నిర్గమకాండము 10:12సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశమంతటిమీదికి మిడతల దండు వచ్చి పొలంలో పెరుగుతున్న ప్రతి మొక్కను, వడగండ్ల వలన పాడవని ప్రతిదాన్ని తినివేసేలా నీ చేతిని ఈజిప్టు మీద చాపు” అని చెప్పారు.
- నిర్గమకాండము 10:13సుమారు క్రీ.పూ. 1491
మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి.
- నిర్గమకాండము 10:14సుమారు క్రీ.పూ. 1491
ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు.
- నిర్గమకాండము 10:15సుమారు క్రీ.పూ. 1491
నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు.
- నిర్గమకాండము 10:16సుమారు క్రీ.పూ. 1491
ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.
- నిర్గమకాండము 10:17సుమారు క్రీ.పూ. 1491
దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.
- నిర్గమకాండము 10:18సుమారు క్రీ.పూ. 1491
మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు.
- నిర్గమకాండము 10:19సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.
- నిర్గమకాండము 10:20సుమారు క్రీ.పూ. 1491
అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.
- నిర్గమకాండము 10:21సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో, “ప్రతి ఒక్కరూ తడుముకునేంత కటిక చీకటి ఈజిప్టు దేశం మీద కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు” అన్నారు.
- నిర్గమకాండము 10:22సుమారు క్రీ.పూ. 1491
మోషే తన చేతిని ఆకాశం వైపు చాపినప్పుడు మూడు రోజులపాటు ఈజిప్టు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది.
- నిర్గమకాండము 10:23సుమారు క్రీ.పూ. 1491
ఆ మూడు రోజులు ఎవరూ ఎవరిని చూడలేకపోయారు తామున్న చోట నుండి లేవలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో వెలుగు ఉంది.
- నిర్గమకాండము 10:24సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు ఫరో మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను సేవించండి. మీ స్త్రీలు పిల్లలను కూడా మీతో వెళ్లవచ్చు; కాని మీ గొర్రెలు పశువులను ఇక్కడే వదిలేయండి” అన్నాడు.
- నిర్గమకాండము 10:25సుమారు క్రీ.పూ. 1491
అందుకు మోషే, “మేము మా దేవుడైన యెహోవాకు బలులు, దహనబలులు అర్పించడానికి కావలసిన పశువులను నీవు మాకు ఇవ్వాలి.
- నిర్గమకాండము 10:26సుమారు క్రీ.పూ. 1491
మా పశువులు కూడా మాతో రావాలి; ఒక్క డెక్క కూడా వదిలిపెట్టము. మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిలో నుండే మేము తీసుకోవాలి, మేము అక్కడికి వెళ్లి మేము వేటితో యెహోవాను సేవించాలో మాకు తెలియదు” అన్నాడు.
- నిర్గమకాండము 10:27సుమారు క్రీ.పూ. 1491
అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు వారు వెళ్లడానికి ఒప్పుకోలేదు.
- నిర్గమకాండము 10:28సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు ఫరో మోషేతో, “నా ఎదుట నుండి వెళ్లిపో! మరలా నీవు నాకు కనపడకుండా చూసుకో! నీవు నా ముఖాన్ని చూసిన రోజునే నీవు మరణిస్తావు” అన్నాడు.
- నిర్గమకాండము 10:29సుమారు క్రీ.పూ. 1491
అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.
- నిర్గమకాండము 11:1సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో మీదికి ఈజిప్టు మీదికి నేను మరొక తెగులును తీసుకువస్తాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు. అతడు మిమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు అతడు ఇక్కడినుండి మిమ్మల్ని పూర్తిగా వెళ్లగొడతాడు.