- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Moses & The Exodus
God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 13:16సుమారు క్రీ.పూ. 1491
యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”
- నిర్గమకాండము 13:17సుమారు క్రీ.పూ. 1491
ఫరో ప్రజలను వెళ్లనిచ్చినప్పుడు, ఫిలిష్తీయుల దేశం గుండా దగ్గర మార్గం ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించలేదు. ఎందుకంటే, “ఒకవేళ ఈ ప్రజలు యుద్ధాన్ని చూసి, వారు మనస్సు మార్చుకొని తిరిగి ఈజిప్టుకు వెళ్తారేమో” అని దేవుడు అనుకున్నారు.
- నిర్గమకాండము 13:18సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి దేవుడు వారిని చుట్టూ త్రిప్పి అరణ్యమార్గంలో ఎర్ర సముద్రం వైపు నడిపించారు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడి ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
- నిర్గమకాండము 13:19సుమారు క్రీ.పూ. 1491
యోసేపు ఇశ్రాయేలీయులతో, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించడానికి వస్తారు, అప్పుడు మీరు నా ఎముకలను ఈ ప్రదేశం నుండి మీతో తీసుకెళ్లాలి” అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మోషే యోసేపు ఎముకలను తనతో తీసుకున్నాడు.
- నిర్గమకాండము 13:20సుమారు క్రీ.పూ. 1491
వారు సుక్కోతు నుండి బయలుదేరి ఏతాము ఎడారి అంచున గుడారాలు వేసుకున్నారు.
- నిర్గమకాండము 13:21సుమారు క్రీ.పూ. 1491
వారు పగలు రాత్రి ప్రయాణం చేయగలిగేలా యెహోవా పగటివేళ మేఘస్తంభంలో రాత్రివేళ వారికి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచారు.
- నిర్గమకాండము 13:22సుమారు క్రీ.పూ. 1491
పగటివేళ మేఘస్తంభం గాని, రాత్రివేళ అగ్నిస్తంభం గాని ప్రజల ఎదుట నుండి వాటి స్థలం వదిలిపోలేదు.
- నిర్గమకాండము 14:1సుమారు క్రీ.పూ. 1491
తర్వాత యెహోవా మోషేతో అన్నారు,
- నిర్గమకాండము 14:2సుమారు క్రీ.పూ. 1491
“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.
- నిర్గమకాండము 14:3సుమారు క్రీ.పూ. 1491
ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వారు ఈ దేశంలో కలవరంతో దారితప్పి తిరుగుతున్నారని, ఎడారిలో చిక్కుకున్నారని’ అనుకుంటాడు.
- నిర్గమకాండము 14:4సుమారు క్రీ.పూ. 1491
నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను కాబట్టి అతడు వారిని వెంటాడుతాడు. కాని ఫరో, అతని సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. నేను యెహోవానై యున్నానని ఈజిప్టువారందరు తెలుసుకుంటారు.” కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.
- నిర్గమకాండము 14:5సుమారు క్రీ.పూ. 1491
ప్రజలు పారిపోయారని ఈజిప్టు రాజుకు తెలియజేసినప్పుడు, వారి గురించి ఫరో అతని సేవకులు తమ మనస్సులు మార్చుకొని, “మనమెందుకు ఇలా చేశాము? మనకు సేవలు చేయకుండా మనం ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చాము!” అని చెప్పుకొన్నారు.
- నిర్గమకాండము 14:6సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి అతడు తన రథాన్ని సిద్ధం చేసుకుని తనతో పాటు తన సైన్యాన్ని తీసుకెళ్లాడు.
- నిర్గమకాండము 14:7సుమారు క్రీ.పూ. 1491
అతడు ప్రత్యేకమైన ఆరువందల రథాలను వాటితో పాటు ఈజిప్టులో ఉన్న ఇతర రథాలన్నిటిని ప్రతి దాని మీద అధిపతులతో తీసుకెళ్లాడు.
- నిర్గమకాండము 14:8సుమారు క్రీ.పూ. 1491
యెహోవా ఈజిప్టు రాజైన ఫరో హృదయాన్ని కఠినం చేసినప్పుడు అతడు నిర్భయంగా వెళ్తున్న ఇశ్రాయేలీయులను వెంటాడాడు.
- నిర్గమకాండము 14:9సుమారు క్రీ.పూ. 1491
ఈజిప్టువారు అంటే ఫరో యొక్క అన్ని గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు, దళాలు ఇశ్రాయేలీయులను వెంటాడి, వారిని దాటి బయల్-సెఫోను ఎదురుగా ఉన్న పీ హహీరోతుకు సమీపంలో సముద్రతీరాన బసచేసి వారిని పట్టుకోడానికి వచ్చారు.
- నిర్గమకాండము 14:10సుమారు క్రీ.పూ. 1491
ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు.
- నిర్గమకాండము 14:11సుమారు క్రీ.పూ. 1491
వారు మోషేతో, “ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకువచ్చావా? ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి మాకు నీవు చేసిందేంటి?
- నిర్గమకాండము 14:12సుమారు క్రీ.పూ. 1491
మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈజిప్టువారికి సేవచేసుకుంటామని ఈజిప్టులో మేము నీతో చెప్పలేక? ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టువారికి సేవచేసుకోవడం మాకు మేలు కదా!” అన్నారు.
- నిర్గమకాండము 14:13సుమారు క్రీ.పూ. 1491
అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు.
- నిర్గమకాండము 14:14సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”
- నిర్గమకాండము 14:15సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపొమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పు.
- నిర్గమకాండము 14:16సుమారు క్రీ.పూ. 1491
నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు.
- నిర్గమకాండము 14:17సుమారు క్రీ.పూ. 1491
నేను ఈజిప్టువారి హృదయాలను కఠినం చేస్తాను కాబట్టి వారు వీరి వెనుక వస్తారు. ఫరోను బట్టి అతని సైన్యమంతటిని బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలుగుతుంది.
- నిర్గమకాండము 14:18సుమారు క్రీ.పూ. 1491
ఫరోను బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలిగినప్పుడు నేనే యెహోవానై యున్నానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.”