కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Moses & The Exodus

God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.

415 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. నిర్గమకాండము 14:19సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ముందు నడుస్తున్న దేవదూత వారి వెనుకకు వెళ్లాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుట నుండి కదిలి వారి వెనుకకు వెళ్లి,

  2. నిర్గమకాండము 14:20సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టువారి సైన్యానికి ఇశ్రాయేలీయుల సైన్యానికి మధ్య నిలబడింది. ఆ రాత్రంతా ఆ మేఘం ఈజిప్టువారికి చీకటి కలిగించింది కాని ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది కాబట్టి ఈజిప్టువారు వీరిని సమీపించలేదు.

  3. నిర్గమకాండము 14:21సుమారు క్రీ.పూ. 1491

    మోషే సముద్రం వైపు తన చేతిని చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రాన్ని పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు రెండుగా విడిపోయాయి,

  4. నిర్గమకాండము 14:22సుమారు క్రీ.పూ. 1491

    ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచివెళ్లారు. వారి కుడి ఎడమల వైపు నీళ్లు గోడల వలె నిలబడ్డాయి.

  5. నిర్గమకాండము 14:23సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టువారు వారిని వెంటపడ్డారు; ఫరో గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు అన్ని సముద్రం మధ్యలో వారిని వెంటాడాయి.

  6. నిర్గమకాండము 14:24సుమారు క్రీ.పూ. 1491

    తెల్లవారుజామున యెహోవా అగ్ని మేఘస్తంభం నుండి ఈజిప్టువారి సైన్యాన్ని చూసి ఆయన వారిని కలవరానికి గురి చేశారు.

  7. నిర్గమకాండము 14:25సుమారు క్రీ.పూ. 1491

    ఆయన వారి రథచక్రాలను ఇరక్కుపోయేలా చేయడంతో వాటిని నడపడం వారికి కష్టంగా ఉంది. అప్పుడు ఈజిప్టువారు, “ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం రండి! వారి పక్షంగా యెహోవా ఈజిప్టువారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పుకున్నారు.

  8. నిర్గమకాండము 14:26సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టువారి మీదికి వారి రథాల మీదికి వారి గుర్రపురౌతుల మీదికి నీళ్లు వచ్చేలా నీ చేయి సముద్రం మీద చాపు” అన్నారు.

  9. నిర్గమకాండము 14:27సుమారు క్రీ.పూ. 1491

    మోషే సముద్రం మీద తన చేయి చాపగా సూర్యోదయ సమయంలో సముద్రం తన స్థానంలోనికి తిరిగి వచ్చేసింది. ఈజిప్టువారు దాని నుండి పారిపోతున్నారు కాని యెహోవా వారిని సముద్రంలో ముంచివేసారు.

  10. నిర్గమకాండము 14:28సుమారు క్రీ.పూ. 1491

    నీళ్లు వెనుకకు ప్రవహించి సముద్రంలో ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యమంతటిని అంటే రథాలను గుర్రపురౌతులను కప్పివేశాయి. వారిలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.

  11. నిర్గమకాండము 14:29సుమారు క్రీ.పూ. 1491

    అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేలమీద వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడ్డాయి.

  12. నిర్గమకాండము 14:30సుమారు క్రీ.పూ. 1491

    ఆ రోజు యెహోవా ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. ఇశ్రాయేలీయులు సముద్రతీరాన చచ్చిపడివున్న ఈజిప్టువారిని చూశారు.

  13. నిర్గమకాండము 14:31సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టువారికి వ్యతిరేకంగా పని చేసిన యెహోవా బలమైన హస్తాన్ని ఇశ్రాయేలీయులు చూచారు కాబట్టి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకముంచారు.

  14. నిర్గమకాండము 15:1సుమారు క్రీ.పూ. 1491

    దాని తర్వాత మోషే ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు: “నేను యెహోవాకు పాడతాను, ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశారు.

  15. నిర్గమకాండము 15:2సుమారు క్రీ.పూ. 1491

    “యెహోవాయే నా బలము నా పాట; ఆయన నాకు రక్షణ అయ్యారు. ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.

  16. నిర్గమకాండము 15:3సుమారు క్రీ.పూ. 1491

    యెహోవా యుద్ధవీరుడు; యెహోవా అని ఆయనకు పేరు.

  17. నిర్గమకాండము 15:4సుమారు క్రీ.పూ. 1491

    ఆయన ఫరో రథాలను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసారు. అతని అధిపతులలో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.

  18. నిర్గమకాండము 15:5సుమారు క్రీ.పూ. 1491

    అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.

  19. నిర్గమకాండము 15:6సుమారు క్రీ.పూ. 1491

    యెహోవా, మీ కుడిచేయి, బలంలో మహిమగలది. యెహోవా, మీ కుడిచేయి, శత్రువును పడగొట్టింది.

  20. నిర్గమకాండము 15:7సుమారు క్రీ.పూ. 1491

    “మీకు వ్యతిరేకంగా లేచినవారిని మీ మహిమాతిశయంతో అణచివేశారు. మీరు మీ కోపాగ్నిని రగిలించారు అది వారిని చెత్తలా దహించింది.

  21. నిర్గమకాండము 15:8సుమారు క్రీ.పూ. 1491

    మీ ముక్కు నుండి వచ్చిన ఊపిరివలన నీళ్లు కుప్పగా నిలిచాయి. ప్రవాహజలాలు గోడలా నిలబడ్డాయి; అగాధజలాలు సముద్రం మధ్యలో గడ్డకట్టాయి.

  22. నిర్గమకాండము 15:9సుమారు క్రీ.పూ. 1491

    ‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.

  23. నిర్గమకాండము 15:10సుమారు క్రీ.పూ. 1491

    అయితే మీరు మీ శ్వాసను ఊదగా సముద్రం వారిని కప్పేసింది. వారు బలమైన జలాల క్రింద సీసంలా మునిగిపోయారు.

  24. నిర్గమకాండము 15:11సుమారు క్రీ.పూ. 1491

    యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?

  25. నిర్గమకాండము 15:12సుమారు క్రీ.పూ. 1491

    “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.