కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రోమీయులకు 3:15సుమారు క్రీ.శ. 60

    “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;

  2. రోమీయులకు 3:16సుమారు క్రీ.శ. 60

    వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి,

  3. రోమీయులకు 3:17సుమారు క్రీ.శ. 60

    సమాధాన మార్గం వారికి తెలియదు.”

  4. రోమీయులకు 3:18సుమారు క్రీ.శ. 60

    “వారి కళ్లలో దేవుని భయం లేదు.”

  5. రోమీయులకు 3:19సుమారు క్రీ.శ. 60

    ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు.

  6. రోమీయులకు 3:20సుమారు క్రీ.శ. 60

    కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.

  7. రోమీయులకు 3:21సుమారు క్రీ.శ. 60

    అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.

  8. రోమీయులకు 3:22సుమారు క్రీ.శ. 60

    యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు.

  9. రోమీయులకు 3:23సుమారు క్రీ.శ. 60

    అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు.

  10. రోమీయులకు 3:24సుమారు క్రీ.శ. 60

    కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.

  11. రోమీయులకు 3:25సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు.

  12. రోమీయులకు 3:26సుమారు క్రీ.శ. 60

    ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.

  13. రోమీయులకు 3:27సుమారు క్రీ.శ. 60

    అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే.

  14. రోమీయులకు 3:28సుమారు క్రీ.శ. 60

    కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము.

  15. రోమీయులకు 3:29సుమారు క్రీ.శ. 60

    దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే.

  16. రోమీయులకు 3:30సుమారు క్రీ.శ. 60

    దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు.

  17. రోమీయులకు 3:31సుమారు క్రీ.శ. 60

    అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.

  18. రోమీయులకు 4:1సుమారు క్రీ.శ. 60

    అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడని మనం అనవచ్చు?

  19. రోమీయులకు 4:2సుమారు క్రీ.శ. 60

    ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది కాని దేవుని ఎదుట కాదు.

  20. రోమీయులకు 4:3సుమారు క్రీ.శ. 60

    లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది” అనే కదా!

  21. రోమీయులకు 4:4సుమారు క్రీ.శ. 60

    పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు.

  22. రోమీయులకు 4:5సుమారు క్రీ.శ. 60

    అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది.

  23. రోమీయులకు 4:6సుమారు క్రీ.శ. 60

    క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.

  24. రోమీయులకు 4:7సుమారు క్రీ.శ. 60

    “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

  25. రోమీయులకు 4:8సుమారు క్రీ.శ. 60

    ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.”