కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రోమీయులకు 5:9సుమారు క్రీ.శ. 60

    ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం!

  2. రోమీయులకు 5:10సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము.

  3. రోమీయులకు 5:11సుమారు క్రీ.శ. 60

    అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము.

  4. రోమీయులకు 5:12సుమారు క్రీ.శ. 60

    ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది.

  5. రోమీయులకు 5:13సుమారు క్రీ.శ. 60

    ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు.

  6. రోమీయులకు 5:14సుమారు క్రీ.శ. 60

    అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు.

  7. రోమీయులకు 5:15సుమారు క్రీ.శ. 60

    అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా!

  8. రోమీయులకు 5:16సుమారు క్రీ.శ. 60

    దేవుని వరం ఒక మనుష్యుని పాపం యొక్క ఫలితంతో పోల్చబడలేదు: ఒక పాపం వలన తీర్పు వచ్చి శిక్షను తీసుకువచ్చింది, కాని అనేక అతిక్రమాల తర్వాత వచ్చిన వరం నీతిమంతులుగా చేసింది.

  9. రోమీయులకు 5:17సుమారు క్రీ.శ. 60

    ఒకవేళ ఒక్క మనుష్యుని అతిక్రమం వల్ల ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యమేలితే, దేవుని కృపాసమృద్ధిని, నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యమేలుతారు!

  10. రోమీయులకు 5:18సుమారు క్రీ.శ. 60

    అదేరీతిగా ఒక్కని అతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒక్కని నీతిక్రియ ఫలితంగా ప్రజలందరికి జీవప్రదమైన నీతి అనుగ్రహించబడింది.

  11. రోమీయులకు 5:19సుమారు క్రీ.శ. 60

    ఒక్క మనుష్యుని అవిధేయత వల్ల అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.

  12. రోమీయులకు 5:20సుమారు క్రీ.శ. 60

    అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకు వచ్చినట్టైంది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత విస్తరించింది.

  13. రోమీయులకు 5:21సుమారు క్రీ.శ. 60

    కాబట్టి, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది.

  14. రోమీయులకు 6:1సుమారు క్రీ.శ. 60

    అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా?

  15. రోమీయులకు 6:2సుమారు క్రీ.శ. 60

    ఎన్నడు అలా చెప్పకూడదు. పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం?

  16. రోమీయులకు 6:3సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా?

  17. రోమీయులకు 6:4సుమారు క్రీ.శ. 60

    తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము.

  18. రోమీయులకు 6:5సుమారు క్రీ.శ. 60

    మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము.

  19. రోమీయులకు 6:6సుమారు క్రీ.శ. 60

    మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.

  20. రోమీయులకు 6:7సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు.

  21. రోమీయులకు 6:8సుమారు క్రీ.శ. 60

    కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.

  22. రోమీయులకు 6:9సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు.

  23. రోమీయులకు 6:10సుమారు క్రీ.శ. 60

    ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.

  24. రోమీయులకు 6:11సుమారు క్రీ.శ. 60

    అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి.

  25. రోమీయులకు 6:12సుమారు క్రీ.శ. 60

    కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి.