కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 5:15సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోనుకు కొండల్లో బరువులు మోసేవారు డెబ్బైవేలమంది, రాళ్లు కొట్టేవారు ఎనభైవేలమంది ఉన్నారు.

  2. 1 రాజులు 5:16సుమారు క్రీ.పూ. 1014

    అంతేకాక, ఆ పనివారిచేత పని చేయించడానికి మూడువేల మూడువందలమంది అధికారులు ఉన్నారు.

  3. 1 రాజులు 5:17సుమారు క్రీ.పూ. 1014

    రాజు ఆజ్ఞమేరకు దేవాలయ పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గనులలో నుండి చాలా విలువైన రాళ్లను తవ్వి తెప్పించారు.

  4. 1 రాజులు 5:18సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను, హీరాములు పంపిన శిల్పకారులును గెబాలీయుల ప్రదేశం నుండి వచ్చిన పనివారును మందిరాన్ని కట్టడానికి మ్రానులను రాళ్లను సిద్ధం చేశారు.

  5. 1 రాజులు 6:1సుమారు క్రీ.పూ. 1011

    ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.

  6. 1 రాజులు 6:2సుమారు క్రీ.పూ. 1011

    రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు.

  7. 1 రాజులు 6:3సుమారు క్రీ.పూ. 1011

    మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు.

  8. 1 రాజులు 6:4సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు.

  9. 1 రాజులు 6:5సుమారు క్రీ.పూ. 1011

    ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు.

  10. 1 రాజులు 6:6సుమారు క్రీ.పూ. 1011

    క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు, రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు.

  11. 1 రాజులు 6:7సుమారు క్రీ.పూ. 1011

    మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు.

  12. 1 రాజులు 6:8సుమారు క్రీ.పూ. 1011

    క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.

  13. 1 రాజులు 6:9సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు.

  14. 1 రాజులు 6:10సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి.

  15. 1 రాజులు 6:11సుమారు క్రీ.పూ. 1011

    యెహోవా వాక్కు సొలొమోనుతో,

  16. 1 రాజులు 6:12సుమారు క్రీ.పూ. 1011

    “నీవు కట్టించే ఈ మందిరం విషయంలో, నీవు నా శాసనాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికి లోబడితే, నేను నీ తండ్రియైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను.

  17. 1 రాజులు 6:13సుమారు క్రీ.పూ. 1011

    ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను, నా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టను” అని చెప్పారు.

  18. 1 రాజులు 6:14సుమారు క్రీ.పూ. 1011

    సొలొమోను మందిరం కట్టించడం ముగించాడు.

  19. 1 రాజులు 6:15సుమారు క్రీ.పూ. 1011

    మందిరం లోపలి గోడలను, అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలను, నేలను సరళవృక్షాల పలకలను పరిచారు.

  20. 1 రాజులు 6:16సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిరం వెనుక భాగంలో నేల నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో ఇరవై మూరల ఎత్తు గర్భాలయాన్ని అనగా అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు.

  21. 1 రాజులు 6:17సుమారు క్రీ.పూ. 1011

    అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న విశాల గది పొడవు నలభై మూరలు.

  22. 1 రాజులు 6:18సుమారు క్రీ.పూ. 1011

    మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుండ్రని పండ్లు, విచ్చుకున్న పువ్వులు చెక్కారు; అంతా దేవదారు కర్ర పనే ఉంది గాని రాయి ఒక్కటి కూడా కనిపించదు.

  23. 1 రాజులు 6:19సుమారు క్రీ.పూ. 1011

    అతడు మందిరం లోపల యెహోవా నిబంధన మందసం పెట్టడానికి గర్భాలయాన్ని సిద్ధపరిచాడు.

  24. 1 రాజులు 6:20సుమారు క్రీ.పూ. 1011

    గర్భాలయం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దాని లోపలంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా చేయించాడు.

  25. 1 రాజులు 6:21సుమారు క్రీ.పూ. 1011

    సొలొమోను మందిరం లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, గర్భాలయం ముందు భాగానికి బంగారు గొలుసుల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.