- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 6:22సుమారు క్రీ.పూ. 1011
మందిరం లోపలి భాగం పూర్తిగా బంగారంతో పొదిగించాడు. గర్భాలయానికి సంబంధించిన బలిపీఠాన్ని కూడా బంగారంతో పొదిగించాడు.
- 1 రాజులు 6:23సుమారు క్రీ.పూ. 1011
గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి.
- 1 రాజులు 6:24సుమారు క్రీ.పూ. 1011
మొదటి కెరూబుకు ఒక్కో రెక్క పొడవు అయిదు మూరలు, ఒక రెక్క కొన నుండి ఇంకొక రెక్క కొన వరకు పది మూరలు.
- 1 రాజులు 6:25సుమారు క్రీ.పూ. 1011
రెండవ కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులు ఒకే కొలతతో ఒకే ఆకారంతో ఉన్నాయి.
- 1 రాజులు 6:26సుమారు క్రీ.పూ. 1011
ఒక్కో కెరూబు ఎత్తు పది మూరలు.
- 1 రాజులు 6:27సుమారు క్రీ.పూ. 1011
అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొని ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను, మరో కెరూబు రెక్క ఇంకొక గోడను తాకుతూ గది మధ్యలో వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి.
- 1 రాజులు 6:28సుమారు క్రీ.పూ. 1011
అతడు కెరూబులను బంగారంతో పొదిగించాడు.
- 1 రాజులు 6:29సుమారు క్రీ.పూ. 1011
గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు.
- 1 రాజులు 6:30సుమారు క్రీ.పూ. 1011
అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు.
- 1 రాజులు 6:31సుమారు క్రీ.పూ. 1011
గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి.
- 1 రాజులు 6:32సుమారు క్రీ.పూ. 1011
ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు.
- 1 రాజులు 6:33సుమారు క్రీ.పూ. 1011
అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది.
- 1 రాజులు 6:34సుమారు క్రీ.పూ. 1011
అంతేకాక అతడు రెండు తలుపులు సరళవృక్షాల కర్రతో చేయించాడు, ఆ రెండిటికి రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.
- 1 రాజులు 6:35సుమారు క్రీ.పూ. 1011
అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు.
- 1 రాజులు 6:36సుమారు క్రీ.పూ. 1011
లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
- 1 రాజులు 6:37సుమారు క్రీ.పూ. 1011
నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు.
- 1 రాజులు 6:38సుమారు క్రీ.పూ. 1011
పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది.
అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.
స్తంభాల మీది దూలాల పైకప్పును దేవదారుతో చేశారు. ఒక్కో వరుసలో పదిహేను స్తంభాల చొప్పున మూడు వరుసల్లో నలభై అయిదు స్తంభాలు ఉన్నాయి.
దాని కిటికీలు మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉంచారు.
అన్ని తలుపుల, కిటికీల గుమ్మాలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి; అవి ముందు భాగంలో మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
సొలొమోను స్తంభాలతో ఒక మండపాన్ని కట్టించాడు, దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్పై మూరలు, దానికి ముందు స్తంభాలతో కట్టిన వసారా ఉంది.
అతడు తీర్పు తీర్చడానికి సింహాసన గదిని, న్యాయస్థాన గదిని కట్టించాడు. దానిని అడుగు నుండి పైకప్పు వరకు దేవదారుతో కప్పించాడు.
దాని లోపలి ఆవరణంలో అతడు నివసించే రాజభవనాన్ని ఆ విధంగానే కట్టించాడు. సొలొమోను తాను పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెకు కూడా ఇలాంటి భవనాన్నే కట్టించాడు.