కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 4:24సుమారు క్రీ.పూ. 1014

    అతడు యూఫ్రటీసు నదికి పడమరగా, తిఫ్సహు నుండి గాజా వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించాడు. ఆ సమయంలో అన్ని వైపుల నెమ్మది ఉండింది.

  2. 1 రాజులు 4:25సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.

  3. 1 రాజులు 4:26సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను రథాల కోసం వాటిని లాగే గుర్రాల కోసం నాలుగువేల గుర్రపు శాలలు, పన్నెండు వేల రథసారధులు ఉన్నారు.

  4. 1 రాజులు 4:27సుమారు క్రీ.పూ. 1014

    జిల్లా అధికారులు ఒక్కొక్కరు తమకు నియమించిన నెలలో రాజైన సొలొమోనుకు, అతని బల్ల దగ్గర కూర్చునే అందరికి ఏ కొరత లేకుండ ఆహారపదార్థాలు సరఫరా చేసేవారు.

  5. 1 రాజులు 4:28సుమారు క్రీ.పూ. 1014

    అంతేకాక, రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న చోట్లకు తమకు నిర్ణయించబడిన ప్రకారం యవలను, ఎండు గడ్డిని తెచ్చేవారు.

  6. 1 రాజులు 4:29సుమారు క్రీ.పూ. 1014

    దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు.

  7. 1 రాజులు 4:30సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది.

  8. 1 రాజులు 4:31సుమారు క్రీ.పూ. 1014

    అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది.

  9. 1 రాజులు 4:32సుమారు క్రీ.పూ. 1014

    అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు.

  10. 1 రాజులు 4:33సుమారు క్రీ.పూ. 1014

    అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు.

  11. 1 రాజులు 4:34సుమారు క్రీ.పూ. 1014

    అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు.

  12. 1 రాజులు 5:1సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.

  13. 1 రాజులు 5:2సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను హీరాముకు ఇలా సందేశం పంపాడు:

  14. 1 రాజులు 5:3సుమారు క్రీ.పూ. 1014

    “యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు.

  15. 1 రాజులు 5:4సుమారు క్రీ.పూ. 1014

    అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు.

  16. 1 రాజులు 5:5సుమారు క్రీ.పూ. 1014

    కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను.

  17. 1 రాజులు 5:6సుమారు క్రీ.పూ. 1014

    “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”

  18. 1 రాజులు 5:7సుమారు క్రీ.పూ. 1014

    హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.

  19. 1 రాజులు 5:8సుమారు క్రీ.పూ. 1014

    హీరాము సొలొమోనుకు ఇలా జవాబిచ్చాడు: “మీరు నాకు పంపిన సందేశం అంగీకరించాను, నేను మీరు కోరినట్టు దేవదారు, సరళవృక్షాల మ్రానులను ఇస్తాను.

  20. 1 రాజులు 5:9సుమారు క్రీ.పూ. 1014

    నా పనివారు వాటిని లెబానోను నుండి మధ్యధరా సముద్రతీరానికి తెస్తారు. అక్కడినుండి మీరు చెప్పే స్థలానికి తెప్పలుగా కట్టించి సముద్రం మీదుగా పంపుతాను. అక్కడ వాటిని మీకు అందించే ఏర్పాటు నేను చేస్తాను, మీరు వాటిని తీసుకోవచ్చు. నా కోరిక ప్రకారం మీరు జరిగించి నా రాజకుటుంబానికి ఆహారాన్ని అందించండి.”

  21. 1 రాజులు 5:10సుమారు క్రీ.పూ. 1014

    ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.

  22. 1 రాజులు 5:11సుమారు క్రీ.పూ. 1014

    సొలొమోను హీరాముకు అతని ఇంటివారికి ఆహారంగా 20,000 కోరుల గోధుమలను, 20,000 బాతుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఇచ్చాడు. సొలొమోను హీరాముకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చాడు.

  23. 1 రాజులు 5:12సుమారు క్రీ.పూ. 1014

    యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. హీరాము సొలొమోనులు సమాధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.

  24. 1 రాజులు 5:13సుమారు క్రీ.పూ. 1014

    రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిలో నుండి ముప్పైవేల మందిని వెట్టిపనులు చేయడానికి ఏర్పాటు చేశాడు.

  25. 1 రాజులు 5:14సుమారు క్రీ.పూ. 1014

    వారిని వంతు ప్రకారం నెలకు పదివేలమందిని లెబానోనుకు పంపేవాడు. వారు లెబానోనులో ఒక నెల, ఇంటి దగ్గర రెండు నెలలు గడిపేవారు. నిర్భంద కూలీల మీద అదోనిరాము అధికారి.