- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 3:27సుమారు క్రీ.పూ. 1014
అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”
- 1 రాజులు 3:28సుమారు క్రీ.పూ. 1014
రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.
- 1 రాజులు 4:1సుమారు క్రీ.పూ. 1014
రాజైన సొలొమోను ఇశ్రాయేలు అంతటిని పరిపాలించాడు.
- 1 రాజులు 4:2సుమారు క్రీ.పూ. 1014
అతని ప్రముఖ అధికారులు వీరు: సాదోకు కుమారుడు యాజకుడైన అజర్యా;
- 1 రాజులు 4:3సుమారు క్రీ.పూ. 1014
షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి;
- 1 రాజులు 4:4సుమారు క్రీ.పూ. 1014
యెహోయాదా కుమారుడైన బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజకులు;
- 1 రాజులు 4:5సుమారు క్రీ.పూ. 1014
నాతాను కుమారుడైన అజర్యా జిల్లా అధికారులకు అధికారి; నాతాను కుమారుడైన జాబూదు యాజకుడు రాజుకు సలహాదారుడు;
- 1 రాజులు 4:6సుమారు క్రీ.పూ. 1014
అహీషారు రాజభవన నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టిచాకిరి చేసేవారిపై అధికారి.
- 1 రాజులు 4:7సుమారు క్రీ.పూ. 1014
సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు.
- 1 రాజులు 4:8సుమారు క్రీ.పూ. 1014
వారి అధికారుల పేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ సీమకు బెన్-హూరు అధికారి;
- 1 రాజులు 4:9సుమారు క్రీ.పూ. 1014
మాకస్సు, షయల్బీము, బేత్-షెమెషులో, ఎలోన్-బేత్-హనానులకు బెన్-దెకెరు అధికారి;
- 1 రాజులు 4:10సుమారు క్రీ.పూ. 1014
అరుబ్బోతుకు బెన్-హెసెదు అధికారి (శోకో, హెఫెరు ప్రదేశమంతా ఇతనికి అప్పగించబడ్డాయి);
- 1 రాజులు 4:11సుమారు క్రీ.పూ. 1014
నఫోత్ దోరుకు బెన్-అబీనాదాబు అధికారి (ఇతడు సొలొమోను కుమార్తెయైన టఫాతును పెళ్ళి చేసుకున్నాడు);
- 1 రాజులు 4:12సుమారు క్రీ.పూ. 1014
తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి;
- 1 రాజులు 4:13సుమారు క్రీ.పూ. 1014
రామోత్ గిలాదుకు బెన్-గెబెరు అధికారి; (ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు ప్రాంతం, దాని యొక్క పెద్ద ప్రాకారాలు ఇత్తడి ద్వారబంధాలు కలిగిన అరవై పట్టణాలు అప్పగించబడ్డాయి);
- 1 రాజులు 4:14సుమారు క్రీ.పూ. 1014
మహనయీముకు ఇద్దో కుమారుడైన అహీనాదాబు అధికారి;
- 1 రాజులు 4:15సుమారు క్రీ.పూ. 1014
నఫ్తాలికి అహిమయస్సు అధికారి (ఇతడు సొలొమోను యొక్క మరొక కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు);
- 1 రాజులు 4:16సుమారు క్రీ.పూ. 1014
ఆషేరుకు, బెయాలోతుకు హూషై కుమారుడైన బయనా అధికారి;
- 1 రాజులు 4:17సుమారు క్రీ.పూ. 1014
ఇశ్శాఖారుకు పరూయహు కుమారుడైన యెహోషాపాతు అధికారి;
- 1 రాజులు 4:18సుమారు క్రీ.పూ. 1014
బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి;
- 1 రాజులు 4:19సుమారు క్రీ.పూ. 1014
గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి.
- 1 రాజులు 4:20సుమారు క్రీ.పూ. 1014
యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు.
- 1 రాజులు 4:21సుమారు క్రీ.పూ. 1014
సొలొమోను యూఫ్రటీసు నది నుండి ఫిలిష్తీయ దేశం, ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ దేశ ప్రజలు సొలొమోనుకు పన్ను చెల్లిస్తూ, అతడు బ్రతికి ఉన్నంత కాలం అతనికి సేవ చేస్తూ ఉన్నారు.
- 1 రాజులు 4:22సుమారు క్రీ.పూ. 1014
సొలొమోను యొక్క ప్రతిదిన ఆహారపదార్థాలు, ముప్పై కోరుల సన్నని గోధుమ పిండి, అరవై కోరుల ముతక పిండి,
- 1 రాజులు 4:23సుమారు క్రీ.పూ. 1014
పది దొడ్లలో మేపే పశువులు, ఇరవై పచ్చికల్లో మేసే పశువులు, వంద గొర్రెలు, మేకలు, అంతేకాక జింకలు దుప్పులు, లేళ్ళు, క్రొవ్విన బాతులు.