- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 22:2సుమారు క్రీ.పూ. 1872
అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.”
- ఆదికాండము 22:3సుమారు క్రీ.పూ. 1872
మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు.
- ఆదికాండము 22:4సుమారు క్రీ.పూ. 1872
మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు.
- ఆదికాండము 22:5సుమారు క్రీ.పూ. 1872
అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు.
- ఆదికాండము 22:6సుమారు క్రీ.పూ. 1872
అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు,
- ఆదికాండము 22:7సుమారు క్రీ.పూ. 1872
ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు. “నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు. ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు.
- ఆదికాండము 22:8సుమారు క్రీ.పూ. 1872
“నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
- ఆదికాండము 22:9సుమారు క్రీ.పూ. 1872
దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు.
- ఆదికాండము 22:10సుమారు క్రీ.పూ. 1872
తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు.
- ఆదికాండము 22:11సుమారు క్రీ.పూ. 1872
అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు. “చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
- ఆదికాండము 22:12సుమారు క్రీ.పూ. 1872
“ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు.
- ఆదికాండము 22:13సుమారు క్రీ.పూ. 1872
అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు.
- ఆదికాండము 22:14సుమారు క్రీ.పూ. 1872
అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది.
- ఆదికాండము 22:15సుమారు క్రీ.పూ. 1872
యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు,
- ఆదికాండము 22:16సుమారు క్రీ.పూ. 1872
“యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి,
- ఆదికాండము 22:17సుమారు క్రీ.పూ. 1872
నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు,
- ఆదికాండము 22:18సుమారు క్రీ.పూ. 1872
నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”
- ఆదికాండము 22:19సుమారు క్రీ.పూ. 1872
తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు.
- ఆదికాండము 22:20సుమారు క్రీ.పూ. 1862
కొంతకాలం తర్వాత, అబ్రాహాముకు ఇలా చెప్పబడింది, “మిల్కా కూడా తల్లి అయ్యింది; నీ సోదరుడు నాహోరుకు ఆమె జన్మనిచ్చిన కుమారులు:
- ఆదికాండము 22:21సుమారు క్రీ.పూ. 1862
మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, కెమూయేలు (అరాము ఇతని కుమారుడు),
- ఆదికాండము 22:22సుమారు క్రీ.పూ. 1862
కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”
- ఆదికాండము 22:23సుమారు క్రీ.పూ. 1862
బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు.
- ఆదికాండము 22:24సుమారు క్రీ.పూ. 1862
రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది: తెబహు, గహము, తహషు, మయకా.
- ఆదికాండము 23:1సుమారు క్రీ.పూ. 1860
శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
- ఆదికాండము 23:2సుమారు క్రీ.పూ. 1860
ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు.