Skip to content

Gomorrah

23 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gomorrha

31.1500, 35.4700 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gomorrah ను ప్రస్తావించే వచనాలు

  1. కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)

  2. లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.)

  3. ఈ రాజులు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిము రాజైన షెమేబెరుతోను బేల (సోయరు) రాజుతోను యుద్ధం చేశారు.

  4. అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో,

  5. సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు.

  6. ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు.

  7. అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది.

  8. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించారు; యెహోవా దగ్గర నుండి ఆకాశం నుండి అవి కురిపించబడ్డాయి.

  9. సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు.

  10. దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.

  11. వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది. వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి, వాటి గెలలు చేదుగా ఉన్నాయి.

  12. సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.

  13. సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.

  14. అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు.

  15. యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”

  16. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.

  17. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, అక్కడ ఎవరూ నివసించనట్లే, ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” అని యెహోవా అంటున్నారు.

  18. “నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు.

  19. కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  20. తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

  21. యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”

  22. దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.

  23. అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.