కంటెంట్‌కు వెళ్లండి

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 23:3సుమారు క్రీ.పూ. 1860

    తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి హిత్తీయులతో మాట్లాడుతూ,

  2. ఆదికాండము 23:4సుమారు క్రీ.పూ. 1860

    “నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు.

  3. ఆదికాండము 23:5సుమారు క్రీ.పూ. 1860

    హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ,

  4. ఆదికాండము 23:6సుమారు క్రీ.పూ. 1860

    “అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు.

  5. ఆదికాండము 23:7సుమారు క్రీ.పూ. 1860

    అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు.

  6. ఆదికాండము 23:8సుమారు క్రీ.పూ. 1860

    వారితో ఇలా అన్నాడు, “మీరు నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడానికి సమ్మతిస్తే, సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలం చివర మక్పేలా గుహ ఉంది, నా తరపున అతనితో మాట్లాడి, ఆ స్థలం నాకు మీ మధ్యలో ఉండే సమాధి స్థలంగా పూర్తి వెలకు అమ్ముమని అడగండి.”

  7. ఆదికాండము 23:9సుమారు క్రీ.పూ. 1860

    That he may give me the cave of Machpelah, which he hath, which is in the end of his field; for as much money as it is worth he shall give it me for a possession of a buryingplace amongst you.

  8. ఆదికాండము 23:10సుమారు క్రీ.పూ. 1860

    హిత్తీయుడైన ఎఫ్రోను అక్కడే తన ప్రజలమధ్య కూర్చుని, పట్టణ గవినికి వచ్చిన హిత్తీయులందరి సమక్షంలో అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు.

  9. ఆదికాండము 23:11సుమారు క్రీ.పూ. 1860

    “నా ప్రభువా, అలా కాదు, నా మాట వినండి; ప్రజలందరి సమక్షంలో నేను పొలాన్ని ఇస్తాను, అందులోని గుహను ఇస్తాను. మీరు పాతి పెట్టుకోండి.”

  10. ఆదికాండము 23:12సుమారు క్రీ.పూ. 1860

    మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు,

  11. ఆదికాండము 23:13సుమారు క్రీ.పూ. 1860

    అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు.

  12. ఆదికాండము 23:14సుమారు క్రీ.పూ. 1860

    ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు.

  13. ఆదికాండము 23:15సుమారు క్రీ.పూ. 1860

    My lord, hearken unto me: the land is worth four hundred shekels of silver; what is that betwixt me and thee? bury therefore thy dead.

  14. ఆదికాండము 23:16సుమారు క్రీ.పూ. 1860

    అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.

  15. ఆదికాండము 23:17సుమారు క్రీ.పూ. 1860

    మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలం అందులో ఉన్న గుహ ఆ పొలం సరిహద్దులో ఉన్న అన్ని చెట్లు

  16. ఆదికాండము 23:18సుమారు క్రీ.పూ. 1860

    పట్టణ గవిని దగ్గర ఉన్న హిత్తీయుల సమక్షంలో అబ్రాహాము పేర దస్తావేజు చేయబడింది.

  17. ఆదికాండము 23:19సుమారు క్రీ.పూ. 1860

    అప్పుడు అబ్రాహాము కనాను దేశంలో, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారా మృతదేహాన్ని పాతిపెట్టాడు.

  18. ఆదికాండము 23:20సుమారు క్రీ.పూ. 1860

    కాబట్టి ఆ పొలం, అందులోని గుహ, హిత్తీయుల వలన స్మశాన వాటికగా అబ్రాహాము పేరు మీద వ్రాయబడింది.

  19. ఆదికాండము 24:1సుమారు క్రీ.పూ. 1857

    అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు.

  20. ఆదికాండము 24:2సుమారు క్రీ.పూ. 1857

    అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు.

  21. ఆదికాండము 24:3సుమారు క్రీ.పూ. 1857

    నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.

  22. ఆదికాండము 24:4సుమారు క్రీ.పూ. 1857

    But thou shalt go unto my country, and to my kindred, and take a wife unto my son Isaac.

  23. ఆదికాండము 24:5సుమారు క్రీ.పూ. 1857

    అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు.

  24. ఆదికాండము 24:6సుమారు క్రీ.పూ. 1857

    అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు.

  25. ఆదికాండము 24:7సుమారు క్రీ.పూ. 1857

    నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు.