- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 24:33సుమారు క్రీ.పూ. 1857
అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.
- ఆదికాండము 24:34సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.
- ఆదికాండము 24:35సుమారు క్రీ.పూ. 1857
యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.
- ఆదికాండము 24:36సుమారు క్రీ.పూ. 1857
నా యజమాని భార్య శారా తన వృద్ధాప్యంలో కుమారున్ని కన్నది, తన ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు.
- ఆదికాండము 24:37సుమారు క్రీ.పూ. 1857
నా యజమాని నాతో ప్రమాణం చేయించి, ‘నీవు నా కుమారునికి నేను నివసించే కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకురాకూడదు,
- ఆదికాండము 24:38సుమారు క్రీ.పూ. 1857
అయితే నా తండ్రి ఇంటికి, నా బంధువుల దగ్గరకు వెళ్లి, నా కుమారునికి భార్యను తీసుకురా’ అని చెప్పాడు.
- ఆదికాండము 24:39సుమారు క్రీ.పూ. 1857
“అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను.
- ఆదికాండము 24:40సుమారు క్రీ.పూ. 1857
“అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు.
- ఆదికాండము 24:41సుమారు క్రీ.పూ. 1857
నీవు మా వంశస్థుల దగ్గరకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు ఆమెను ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, నీకు ఈ ప్రమాణం నుండి విముక్తి’ అని అన్నాడు.
- ఆదికాండము 24:42సుమారు క్రీ.పూ. 1857
“ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి.
- ఆదికాండము 24:43సుమారు క్రీ.పూ. 1857
ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే,
- ఆదికాండము 24:44సుమారు క్రీ.పూ. 1857
ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను.
- ఆదికాండము 24:45సుమారు క్రీ.పూ. 1857
“నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.
- ఆదికాండము 24:46సుమారు క్రీ.పూ. 1857
“త్వరగా ఆమె కడవ భుజం మీది నుండి దింపుకుని, ‘త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తాను’ అని అన్నది. కాబట్టి నేను త్రాగాను ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసింది.
- ఆదికాండము 24:47సుమారు క్రీ.పూ. 1857
“అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను. “అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది. “అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి,
- ఆదికాండము 24:48సుమారు క్రీ.పూ. 1857
తలవంచి నేను యెహోవాను ఆరాధించాను; నా యజమాని సోదరుని మనవరాలిని తన కుమారునికి భార్యగా తీసుకురావడానికి నన్ను సరియైన మార్గంలో నడిపించిన నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవాను స్తుతించాను.
- ఆదికాండము 24:49సుమారు క్రీ.పూ. 1857
ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు.
- ఆదికాండము 24:50సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, “ఇది యెహోవా చేసిన కార్యం; ఈ విషయంలో మేము చెప్పేది ఏమి లేదు.
- ఆదికాండము 24:51సుమారు క్రీ.పూ. 1857
ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకెళ్లండి. యెహోవా సూచించినట్లే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవును గాక.”
- ఆదికాండము 24:52సుమారు క్రీ.పూ. 1857
అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు.
- ఆదికాండము 24:53సుమారు క్రీ.పూ. 1857
తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు.
- ఆదికాండము 24:54సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు అతడు, అతని మనుష్యులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాడు ఉదయం వారు లేచినప్పుడు, అతడు, “నా దారిన నన్ను నా యజమాని దగ్గరకు పంపివేయండి” అని అన్నాడు.
- ఆదికాండము 24:55సుమారు క్రీ.పూ. 1857
అయితే ఆమె తల్లి సోదరుడు, “యువతిని కనీసం పదిరోజులైనా మా దగ్గర ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్లిపోవచ్చు” అని అన్నారు.
- ఆదికాండము 24:56సుమారు క్రీ.పూ. 1857
కాని అతడు, “యెహోవా నా ప్రయాణం సఫలం చేశారు, కాబట్టి ఆలస్యం చేయకుండా నన్ను పంపివేయండి, నా యజమాని దగ్గరకు నేను వెళ్తాను” అన్నాడు.
- ఆదికాండము 24:57సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు.