కంటెంట్‌కు వెళ్లండి

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 24:58సుమారు క్రీ.పూ. 1857

    కాబట్టి వారు రిబ్కాను పిలిచి, “ఇతనితో నీవు వెళ్తావా?” అని అడిగారు. అందుకు ఆమె, “నేను వెళ్తాను” అని జవాబిచ్చింది.

  2. ఆదికాండము 24:59సుమారు క్రీ.పూ. 1857

    కాబట్టి వారు తమ సోదరి రిబ్కాను, ఆమెకు తోడుగా దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను పంపివేశారు.

  3. ఆదికాండము 24:60సుమారు క్రీ.పూ. 1857

    వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు, “మా సోదరీ, నీవు వర్ధిల్లాలి, వేవేల మందికి తల్లివి కావాలి; నీ సంతానపు వారు తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.”

  4. ఆదికాండము 24:61సుమారు క్రీ.పూ. 1857

    అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు.

  5. ఆదికాండము 24:62సుమారు క్రీ.పూ. 1857

    ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు.

  6. ఆదికాండము 24:63సుమారు క్రీ.పూ. 1857

    ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి.

  7. ఆదికాండము 24:64సుమారు క్రీ.పూ. 1857

    రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి,

  8. ఆదికాండము 24:65సుమారు క్రీ.పూ. 1857

    “మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది. అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది.

  9. ఆదికాండము 24:66సుమారు క్రీ.పూ. 1857

    ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు.

  10. ఆదికాండము 24:67సుమారు క్రీ.పూ. 1857

    ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.

  11. ఆదికాండము 25:1సుమారు క్రీ.పూ. 1853

    అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,

  12. ఆదికాండము 25:2సుమారు క్రీ.పూ. 1852

    ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.

  13. ఆదికాండము 25:3సుమారు క్రీ.పూ. 1824

    యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు.

  14. ఆదికాండము 25:4సుమారు క్రీ.పూ. 1804

    ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము.

  15. ఆదికాండము 25:5సుమారు క్రీ.పూ. 1829

    అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు.

  16. ఆదికాండము 25:6సుమారు క్రీ.పూ. 1829

    అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు.

  17. ఆదికాండము 25:7సుమారు క్రీ.పూ. 1821

    అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు.

  18. ఆదికాండము 25:8సుమారు క్రీ.పూ. 1821

    అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు.

  19. ఆదికాండము 25:9సుమారు క్రీ.పూ. 1821

    అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలులు కలిసి తమ తండ్రిని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో సమాధి చేశారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలము.

  20. ఆదికాండము 25:10సుమారు క్రీ.పూ. 1821

    అబ్రాహాము ఆ పొలాన్ని హిత్తీయుల దగ్గర కొన్నాడు. అందులో అబ్రాహాము తన భార్యయైన శారాతో పాటు పాతిపెట్టబడ్డాడు.

  21. ఆదికాండము 25:11సుమారు క్రీ.పూ. 1821

    అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు.

  22. ఆదికాండము 25:12సుమారు క్రీ.పూ. 1821

    శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి:

  23. ఆదికాండము 25:13సుమారు క్రీ.పూ. 1821

    ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,

  24. ఆదికాండము 25:14సుమారు క్రీ.పూ. 1821

    మిష్మా, దూమా, మశ్శా,

  25. ఆదికాండము 25:15సుమారు క్రీ.పూ. 1821

    హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా.