- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 24:8సుమారు క్రీ.పూ. 1857
ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు.
- ఆదికాండము 24:9సుమారు క్రీ.పూ. 1857
ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు.
- ఆదికాండము 24:10సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు ఆ సేవకుడు యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, యజమాని యొక్క అన్ని రకాల శ్రేష్ఠమైన వస్తు సముదాయాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అరాము నహరయీముకు బయలుదేరి, నాహోరు పట్టణం చేరాడు.
- ఆదికాండము 24:11సుమారు క్రీ.పూ. 1857
పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము.
- ఆదికాండము 24:12సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా! నా యజమానియైన అబ్రాహాము దేవా, నేను వచ్చిన పని ఈ రోజు సఫలం చేయండి, నా యజమాని అబ్రాహాముపై దయ చూపండి.
- ఆదికాండము 24:13సుమారు క్రీ.పూ. 1857
నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు.
- ఆదికాండము 24:14సుమారు క్రీ.పూ. 1857
నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.”
- ఆదికాండము 24:15సుమారు క్రీ.పూ. 1857
అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె.
- ఆదికాండము 24:16సుమారు క్రీ.పూ. 1857
రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది.
- ఆదికాండము 24:17సుమారు క్రీ.పూ. 1857
ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి, “నీ కుండలోని నీళ్లు కొన్ని నాకు త్రాగడానికి ఇవ్వు” అని అన్నాడు.
- ఆదికాండము 24:18సుమారు క్రీ.పూ. 1857
“అయ్యా త్రాగండి” అని అంటూ రిబ్కా వెంటనే కుండను చేతి మీదికి దించుకుని, అతనికి నీళ్లు ఇచ్చింది.
- ఆదికాండము 24:19సుమారు క్రీ.పూ. 1857
అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది.
- ఆదికాండము 24:20సుమారు క్రీ.పూ. 1857
కాబట్టి ఆమె త్వరపడి తన కుండలో నీళ్లు తొట్టిలో పోసి, పరుగెత్తుకుంటూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్లి, ఒంటెలన్నిటికి సరిపడే నీళ్లు చేది పోసింది.
- ఆదికాండము 24:21సుమారు క్రీ.పూ. 1857
ఆ సేవకుడు ఒక్క మాట మాట్లాడకుండా, యెహోవా తన ప్రయాణం సఫలం చేశారా లేదా అని ఆమెను గమనిస్తూ ఉన్నాడు.
- ఆదికాండము 24:22సుమారు క్రీ.పూ. 1857
ఒంటెలు నీళ్లు త్రాగిన తర్వాత, అతడు ఒక బెకా బరువుగల బంగారం ముక్కుపుడక, పది షెకెళ్ళ బరువుగల రెండు బంగారు కడియాలు చేతిలో పట్టుకున్నాడు.
- ఆదికాండము 24:23సుమారు క్రీ.పూ. 1857
అప్పుడతడు, “నీవెవరి కుమార్తెవు? దయచేసి చెప్పు, ఈ రాత్రి నీ తండ్రి ఇంట్లో మేము గడపడానికి స్థలం ఉందా?” అని అడిగాడు.
- ఆదికాండము 24:24సుమారు క్రీ.పూ. 1857
అందుకు ఆమె, “నేను మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను” అని జవాబిచ్చింది.
- ఆదికాండము 24:25సుమారు క్రీ.పూ. 1857
“మీరు బసచేయడానికి కావలసిన స్థలం, మీ ఒంటెలకు మేత కూడా మా ఇంట్లో ఉంది” అని కూడా చెప్పింది.
- ఆదికాండము 24:26సుమారు క్రీ.పూ. 1857
అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాను ఆరాధిస్తూ,
- ఆదికాండము 24:27సుమారు క్రీ.పూ. 1857
“నా యజమానియైన అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతి, ఆయన నా యజమానికి తన దయను, తన నమ్మకత్వాన్ని చూపడం మానలేదు. నా మట్టుకైతే, యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు” అని అన్నాడు.
- ఆదికాండము 24:28సుమారు క్రీ.పూ. 1857
ఆ యవ్వన స్త్రీ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి ఇంటివారికి ఈ సంగతులన్ని చెప్పింది.
- ఆదికాండము 24:29సుమారు క్రీ.పూ. 1857
రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు.
- ఆదికాండము 24:30సుమారు క్రీ.పూ. 1857
లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు.
- ఆదికాండము 24:31సుమారు క్రీ.పూ. 1857
“యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.
- ఆదికాండము 24:32సుమారు క్రీ.పూ. 1857
కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు.