కంటెంట్‌కు వెళ్లండి

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 21:11సుమారు క్రీ.పూ. 1893

    తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు.

  2. ఆదికాండము 21:12సుమారు క్రీ.పూ. 1893

    అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది.

  3. ఆదికాండము 21:13సుమారు క్రీ.పూ. 1893

    అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.”

  4. ఆదికాండము 21:14సుమారు క్రీ.పూ. 1892

    మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.

  5. ఆదికాండము 21:15సుమారు క్రీ.పూ. 1892

    తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది.

  6. ఆదికాండము 21:16సుమారు క్రీ.పూ. 1892

    తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది.

  7. ఆదికాండము 21:17సుమారు క్రీ.పూ. 1892

    దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు.

  8. ఆదికాండము 21:18సుమారు క్రీ.పూ. 1892

    ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు.

  9. ఆదికాండము 21:19సుమారు క్రీ.పూ. 1892

    అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది.

  10. ఆదికాండము 21:20సుమారు క్రీ.పూ. 1892

    ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు.

  11. ఆదికాండము 21:21సుమారు క్రీ.పూ. 1892

    అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.

  12. ఆదికాండము 21:22సుమారు క్రీ.పూ. 1886

    ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.

  13. ఆదికాండము 21:23సుమారు క్రీ.పూ. 1886

    కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”

  14. ఆదికాండము 21:24సుమారు క్రీ.పూ. 1886

    అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.

  15. ఆదికాండము 21:25సుమారు క్రీ.పూ. 1886

    అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు.

  16. ఆదికాండము 21:26సుమారు క్రీ.పూ. 1886

    అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.

  17. ఆదికాండము 21:27సుమారు క్రీ.పూ. 1886

    అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు.

  18. ఆదికాండము 21:28సుమారు క్రీ.పూ. 1886

    అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు.

  19. ఆదికాండము 21:29సుమారు క్రీ.పూ. 1886

    అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.

  20. ఆదికాండము 21:30సుమారు క్రీ.పూ. 1886

    అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.

  21. ఆదికాండము 21:31సుమారు క్రీ.పూ. 1886

    అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు.

  22. ఆదికాండము 21:32సుమారు క్రీ.పూ. 1886

    బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు.

  23. ఆదికాండము 21:33సుమారు క్రీ.పూ. 1886

    అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు.

  24. ఆదికాండము 21:34సుమారు క్రీ.పూ. 1886

    అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.

  25. ఆదికాండము 22:1సుమారు క్రీ.పూ. 1872

    కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.