కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 36:7సుమారు క్రీ.పూ. 1491

    ఎందుకంటే, వారు తెచ్చిన కానుకలు ఆ పని అంతా పూర్తి చేయడానికి కావలసిన దానికన్నా ఎక్కువ.

  2. నిర్గమకాండము 36:8సుమారు క్రీ.పూ. 1491

    ఆ పనివారిలో నిపుణులైన వారందరు పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేశారు; వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లించారు.

  3. నిర్గమకాండము 36:9సుమారు క్రీ.పూ. 1491

    తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.

  4. నిర్గమకాండము 36:10సుమారు క్రీ.పూ. 1491

    వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు.

  5. నిర్గమకాండము 36:11సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు.

  6. నిర్గమకాండము 36:12సుమారు క్రీ.పూ. 1491

    అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు.

  7. నిర్గమకాండము 36:13సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.

  8. నిర్గమకాండము 36:14సుమారు క్రీ.పూ. 1491

    వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు.

  9. నిర్గమకాండము 36:15సుమారు క్రీ.పూ. 1491

    పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.

  10. నిర్గమకాండము 36:16సుమారు క్రీ.పూ. 1491

    వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు.

  11. నిర్గమకాండము 36:17సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు.

  12. నిర్గమకాండము 36:18సుమారు క్రీ.పూ. 1491

    దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు.

  13. నిర్గమకాండము 36:19సుమారు క్రీ.పూ. 1491

    ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో గుడారం కోసం పైకప్పును దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేశారు.

  14. నిర్గమకాండము 36:20సుమారు క్రీ.పూ. 1491

    వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు.

  15. నిర్గమకాండము 36:21సుమారు క్రీ.పూ. 1491

    ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,

  16. నిర్గమకాండము 36:22సుమారు క్రీ.పూ. 1491

    రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చారు. వారు సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేశారు.

  17. నిర్గమకాండము 36:23సుమారు క్రీ.పూ. 1491

    సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.

  18. నిర్గమకాండము 36:24సుమారు క్రీ.పూ. 1491

    ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.

  19. నిర్గమకాండము 36:25సుమారు క్రీ.పూ. 1491

    మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.

  20. నిర్గమకాండము 36:26సుమారు క్రీ.పూ. 1491

    వాటి క్రిందకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.

  21. నిర్గమకాండము 36:27సుమారు క్రీ.పూ. 1491

    పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు,

  22. నిర్గమకాండము 36:28సుమారు క్రీ.పూ. 1491

    సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి.

  23. నిర్గమకాండము 36:29సుమారు క్రీ.పూ. 1491

    ఈ రెండు మూలల వద్ద చట్రాలు క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడ్డాయి; రెండూ ఒకేలా ఉన్నాయి.

  24. నిర్గమకాండము 36:30సుమారు క్రీ.పూ. 1491

    అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉన్నాయి.

  25. నిర్గమకాండము 36:31సుమారు క్రీ.పూ. 1491

    అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,