- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 37:19సుమారు క్రీ.పూ. 1491
ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉన్నాయి.
- నిర్గమకాండము 37:20సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉన్నాయి.
- నిర్గమకాండము 37:21సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చారు.
- నిర్గమకాండము 37:22సుమారు క్రీ.పూ. 1491
సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేశారు.
- నిర్గమకాండము 37:23సుమారు క్రీ.పూ. 1491
వారు ఏడు దీపాలు దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేశారు.
- నిర్గమకాండము 37:24సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
- నిర్గమకాండము 37:25సుమారు క్రీ.పూ. 1491
వారు తుమ్మకర్రతో ఒక ధూపవేదిక తయారుచేశారు. అది చతురస్రంగా ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉంది. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేశారు.
- నిర్గమకాండము 37:26సుమారు క్రీ.పూ. 1491
దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేశారు.
- నిర్గమకాండము 37:27సుమారు క్రీ.పూ. 1491
మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, కడ్డీ క్రింద రెండు బంగారు ఉంగరాలు, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా తయారుచేశారు.
- నిర్గమకాండము 37:28సుమారు క్రీ.పూ. 1491
వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు.
- నిర్గమకాండము 37:29సుమారు క్రీ.పూ. 1491
అంతేకాక వారు పవిత్ర అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ వాసనగల ధూపాన్ని తయారుచేశారు.
- నిర్గమకాండము 38:1సుమారు క్రీ.పూ. 1491
వారు తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం దహనబలి కోసం కట్టారు; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉంది.
- నిర్గమకాండము 38:2సుమారు క్రీ.పూ. 1491
వారు కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేశారు. వారు బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించారు.
- నిర్గమకాండము 38:3సుమారు క్రీ.పూ. 1491
దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో తయారుచేశారు.
- నిర్గమకాండము 38:4సుమారు క్రీ.పూ. 1491
దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచారు.
- నిర్గమకాండము 38:5సుమారు క్రీ.పూ. 1491
ఆ జాలి నాలుగు మూలల్లో మోతకర్రలు ఉంచేందుకు ఆ జాలి నాలుగు మూలలకు నాలుగు ఇత్తడి ఉంగరాలు తయారుచేశారు.
- నిర్గమకాండము 38:6సుమారు క్రీ.పూ. 1491
వారు తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించారు.
- నిర్గమకాండము 38:7సుమారు క్రీ.పూ. 1491
బలిపీఠాన్ని మోయడానికి దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చారు; వారు పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేశారు.
- నిర్గమకాండము 38:8సుమారు క్రీ.పూ. 1491
వారు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలతో ఒక ఇత్తడి గంగాళం దానికి ఇత్తడి పీట చేశారు.
- నిర్గమకాండము 38:9సుమారు క్రీ.పూ. 1491
తర్వాత వారు ఆవరణం నిర్మించారు. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:10సుమారు క్రీ.పూ. 1491
దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:11సుమారు క్రీ.పూ. 1491
ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉంది, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:12సుమారు క్రీ.పూ. 1491
పడమర చివర యాభై మూరల వెడల్పు ఉండి, పది స్తంభాలు, పది దిమ్మలతో తెరలు ఉన్నాయి. ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:13సుమారు క్రీ.పూ. 1491
తూర్పు వైపు, అనగా సూర్యోదయం వైపు కూడా, యాభై మూరల వెడల్పు ఉంది.
- నిర్గమకాండము 38:14సుమారు క్రీ.పూ. 1491
ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.