- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 39:9సుమారు క్రీ.పూ. 1491
అది చతురస్రంగా జానెడు పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉంది.
- నిర్గమకాండము 39:10సుమారు క్రీ.పూ. 1491
దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
- నిర్గమకాండము 39:11సుమారు క్రీ.పూ. 1491
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ;
- నిర్గమకాండము 39:12సుమారు క్రీ.పూ. 1491
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
- నిర్గమకాండము 39:13సుమారు క్రీ.పూ. 1491
నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు.
- నిర్గమకాండము 39:14సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి.
- నిర్గమకాండము 39:15సుమారు క్రీ.పూ. 1491
వారు రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేశారు.
- నిర్గమకాండము 39:16సుమారు క్రీ.పూ. 1491
రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు.
- నిర్గమకాండము 39:17సుమారు క్రీ.పూ. 1491
వారు రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి,
- నిర్గమకాండము 39:18సుమారు క్రీ.పూ. 1491
గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించారు.
- నిర్గమకాండము 39:19సుమారు క్రీ.పూ. 1491
వారు రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించారు.
- నిర్గమకాండము 39:20సుమారు క్రీ.పూ. 1491
వారు మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించారు.
- నిర్గమకాండము 39:21సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు.
- నిర్గమకాండము 39:22సుమారు క్రీ.పూ. 1491
వారు ఏఫోదు నిలువుటంగీని ఒక నేత పనిలా పూర్తిగా నీలి బట్టతో తయారుచేసి,
- నిర్గమకాండము 39:23సుమారు క్రీ.పూ. 1491
దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం చేసి అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేశారు.
- నిర్గమకాండము 39:24సుమారు క్రీ.పూ. 1491
వారు ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో పాటు, పేనిన సన్నని నారతో దానిమ్మపండ్లు తయారుచేశారు.
- నిర్గమకాండము 39:25సుమారు క్రీ.పూ. 1491
స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన గంటలను వస్త్రం అంచు చుట్టూ ఉన్న దానిమ్మపండ్ల మధ్య తగిలించారు.
- నిర్గమకాండము 39:26సుమారు క్రీ.పూ. 1491
సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
- నిర్గమకాండము 39:27సుమారు క్రీ.పూ. 1491
వారు అహరోనుకు అతని కుమారులకు సన్నని నారబట్టతో చొక్కా నేసారు.
- నిర్గమకాండము 39:28సుమారు క్రీ.పూ. 1491
సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు.
- నిర్గమకాండము 39:29సుమారు క్రీ.పూ. 1491
పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
- నిర్గమకాండము 39:30సుమారు క్రీ.పూ. 1491
వారు పవిత్ర చిహ్నంగా స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి, దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కారు: పరిశుద్ధత యెహోవాకే.
- నిర్గమకాండము 39:31సుమారు క్రీ.పూ. 1491
దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
- నిర్గమకాండము 39:32సుమారు క్రీ.పూ. 1491
సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.
- నిర్గమకాండము 39:33సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు: గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;