- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 39:34సుమారు క్రీ.పూ. 1491
ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాల పైకప్పు, మన్నికైన తోళ్ల పైకప్పు, కప్పివుంచే తెర;
- నిర్గమకాండము 39:35సుమారు క్రీ.పూ. 1491
నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత;
- నిర్గమకాండము 39:36సుమారు క్రీ.పూ. 1491
బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
- నిర్గమకాండము 39:37సుమారు క్రీ.పూ. 1491
మేలిమి బంగారు దీపస్తంభం, దాని దీపాల వరుస, దాని ఉపకరణాలన్నీ, వెలిగించడానికి ఒలీవనూనె;
- నిర్గమకాండము 39:38సుమారు క్రీ.పూ. 1491
బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర;
- నిర్గమకాండము 39:39సుమారు క్రీ.పూ. 1491
ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;
- నిర్గమకాండము 39:40సుమారు క్రీ.పూ. 1491
ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర; ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు; సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు;
- నిర్గమకాండము 39:41సుమారు క్రీ.పూ. 1491
పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు.
- నిర్గమకాండము 39:42సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.
- నిర్గమకాండము 39:43సుమారు క్రీ.పూ. 1491
మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
- నిర్గమకాండము 40:1సుమారు క్రీ.పూ. 1491
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
- నిర్గమకాండము 40:2సుమారు క్రీ.పూ. 1491
“మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
- నిర్గమకాండము 40:3సుమారు క్రీ.పూ. 1491
దానిలో నిబంధన మందసాన్ని ఉంచి ఆ మందసాన్ని తెరతో కప్పాలి.
- నిర్గమకాండము 40:4సుమారు క్రీ.పూ. 1491
బల్లను లోపలికి తెచ్చి దానికి చెందినవి దాని మీద క్రమంగా ఉంచాలి. దీపస్తంభాన్ని తెచ్చి దీపాలు వెలిగించాలి.
- నిర్గమకాండము 40:5సుమారు క్రీ.పూ. 1491
నిబంధన మందసం ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి సమావేశ గుడారపు ద్వారానికి తెర తగిలించాలి.
- నిర్గమకాండము 40:6సుమారు క్రీ.పూ. 1491
“నీవు ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట దహనబలిపీఠాన్ని ఉంచాలి;
- నిర్గమకాండము 40:7సుమారు క్రీ.పూ. 1491
సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళం ఉంచి దానిలో నీళ్లు నింపాలి.
- నిర్గమకాండము 40:8సుమారు క్రీ.పూ. 1491
దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి.
- నిర్గమకాండము 40:9సుమారు క్రీ.పూ. 1491
“అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలో ఉన్నవాటన్నిటిని అభిషేకించాలి; దానిని, దాని సామాగ్రి అన్నిటిని ప్రతిష్ఠించాలి, అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది.
- నిర్గమకాండము 40:10సుమారు క్రీ.పూ. 1491
తర్వాత దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని అభిషేకించాలి; బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి, అది అత్యంత పరిశుద్ధమవుతుంది.
- నిర్గమకాండము 40:11సుమారు క్రీ.పూ. 1491
గంగాళాన్ని దాని పీటను అభిషేకించి వాటిని పవిత్రం చేయాలి.
- నిర్గమకాండము 40:12సుమారు క్రీ.పూ. 1491
“తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.
- నిర్గమకాండము 40:13సుమారు క్రీ.పూ. 1491
అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.
- నిర్గమకాండము 40:14సుమారు క్రీ.పూ. 1491
అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.
- నిర్గమకాండము 40:15సుమారు క్రీ.పూ. 1491
నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”