- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 38:15సుమారు క్రీ.పూ. 1491
ఆవరణం యొక్క ద్వారానికి అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:16సుమారు క్రీ.పూ. 1491
ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి.
- నిర్గమకాండము 38:17సుమారు క్రీ.పూ. 1491
ఆ స్తంభాల దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల మీదున్న బద్దలు, కొక్కేలు వెండివి. వాటి పైభాగాలు వెండితో పొదిగించబడ్డాయి; అలా ఆవరణం యొక్క స్తంభాలన్నిటికి వెండి బద్దలు ఉన్నాయి.
- నిర్గమకాండము 38:18సుమారు క్రీ.పూ. 1491
ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో తెర తయారుచేయబడింది. అది ఇరవై మూరల పొడవు గల తెర, ఆవరణం యొక్క తెరల్లా అయిదు మూరల ఎత్తు ఉంది.
- నిర్గమకాండము 38:19సుమారు క్రీ.పూ. 1491
దానికి నాలుగు స్తంభాలు వాటిని నాలుగు దిమ్మలు ఇత్తడివి. దాని బద్దలు కొక్కేలు వెండివి. వాటి పైభాగం వెండితో పొదిగించబడ్డాయి.
- నిర్గమకాండము 38:20సుమారు క్రీ.పూ. 1491
సమావేశ గుడారం, దాని చుట్టూ ఉన్న ఆవరణం యొక్క గుడారపు మేకులన్నీ ఇత్తడివి.
- నిర్గమకాండము 38:21సుమారు క్రీ.పూ. 1491
సమావేశ గుడారం అనగా సాక్షి గుడారానికి ఉపయోగించిన వస్తువుల వివరాలు ఇవే, యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో మోషే ఆజ్ఞ ప్రకారం లేవీయులు నమోదు చేశారు:
- నిర్గమకాండము 38:22సుమారు క్రీ.పూ. 1491
యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;
- నిర్గమకాండము 38:23సుమారు క్రీ.పూ. 1491
దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబు అతనికి సహాయకుడు. ఇతడు చెక్కేవాడు, కళాకారుడు, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో బుటా పని చేయగలడు.
- నిర్గమకాండము 38:24సుమారు క్రీ.పూ. 1491
ప్రత్యేక అర్పణల నుండి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటికి ఉపయోగించిన మొత్తం బంగారం పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 29 తలాంతుల 730 షెకెళ్ళు.
- నిర్గమకాండము 38:25సుమారు క్రీ.పూ. 1491
జనాభా లెక్కలలో నమోదైన వారు ఇచ్చిన వెండి పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 100 తలాంతుల 1,775 షెకెళ్ళు.
- నిర్గమకాండము 38:26సుమారు క్రీ.పూ. 1491
ఇరవై సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగి నమోదు చేసుకున్న వారు అనగా 6,03,550 మంది పురుషులు తలా ఒక బెకా అంటే, అర షెకెల్, పరిశుద్ధాలయ షెకెల్ చొప్పున చెల్లించారు.
- నిర్గమకాండము 38:27సుమారు క్రీ.పూ. 1491
100 తలాంతుల వెండిని పరిశుద్ధాలయ దిమ్మలకు ఉపయోగించారు. అవి తెరలకు దిమ్మలు; ఒక దిమ్మకు ఒక తలాంతు చొప్పున 100 దిమ్మలకు 100 తలాంతులు.
- నిర్గమకాండము 38:28సుమారు క్రీ.పూ. 1491
స్తంభాలకు కొక్కేలను, స్తంభం పై భాగంలో పోతపోయడానికి, వాటికి బద్దెలు చేయడానికి 1,775 షెకెళ్ళు ఉపయోగించారు.
- నిర్గమకాండము 38:29సుమారు క్రీ.పూ. 1491
ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు.
- నిర్గమకాండము 38:30సుమారు క్రీ.పూ. 1491
ఆ ఇత్తడిని సమావేశ గుడారపు ద్వారం యొక్క దిమ్మల కోసం, ఇత్తడి బలిపీఠానికి, ఇత్తడి జల్లెడ, దాని పాత్రలన్నిటికి,
- నిర్గమకాండము 38:31సుమారు క్రీ.పూ. 1491
చుట్టూ ఉన్న ఆవరణానికి, దాని ద్వారానికి దిమ్మలు చేయడానికి, సమావేశ గుడారం, చుట్టూ ఉన్న ఆవరణపు అన్ని మేకులు చేయడానికి ఉపయోగించారు.
- నిర్గమకాండము 39:1సుమారు క్రీ.పూ. 1491
పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు.
- నిర్గమకాండము 39:2సుమారు క్రీ.పూ. 1491
బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేశారు.
- నిర్గమకాండము 39:3సుమారు క్రీ.పూ. 1491
నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో నైపుణ్యమైన పనిగా నేయడానికి బంగారాన్ని రేకులుగా సాగగొట్టి దానిని తీగెలుగా కత్తిరించారు.
- నిర్గమకాండము 39:4సుమారు క్రీ.పూ. 1491
ఏఫోదుకు భుజాల ముక్కలు తయారుచేసి అది కదలకుండా ఉండేలా దాని రెండు మూలల్లో కూర్చారు.
- నిర్గమకాండము 39:5సుమారు క్రీ.పూ. 1491
నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
- నిర్గమకాండము 39:6సుమారు క్రీ.పూ. 1491
వారు లేతపచ్చ రాళ్లు తీసుకుని చెక్కేవారు ముద్రను చెక్కినట్లు వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కి బంగారు జరీ చట్రంలోకి ఎక్కించి,
- నిర్గమకాండము 39:7సుమారు క్రీ.పూ. 1491
తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
- నిర్గమకాండము 39:8సుమారు క్రీ.పూ. 1491
నైపుణ్యం ఉట్టిపడేలా ఏఫోదును చేసినట్లు బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో పతకాన్ని తయారుచేశారు.