- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
తర్వాత యెహోవా మోషేతో, “ఈ మాటలను వ్రాయి; ఎందుకంటే ఈ మాటలను అనుసరించి నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాను” అన్నారు.
మోషే నలభై రాత్రింబవళ్ళు యెహోవాతో పాటు అక్కడే, ఆహారం తినకుండ నీళ్లు త్రాగకుండ ఉన్నాడు. అతడు నిబంధన మాటలు అనగా పది ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాశాడు.
- నిర్గమకాండము 34:29సుమారు క్రీ.పూ. 1491
మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు.
- నిర్గమకాండము 34:30సుమారు క్రీ.పూ. 1491
అహరోను, ఇశ్రాయేలీయులందరు మోషేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్లడానికి వారు భయపడ్డారు.
- నిర్గమకాండము 34:31సుమారు క్రీ.పూ. 1491
అయితే మోషే వారిని పిలిచాడు; కాబట్టి అహరోను, సమాజ నాయకులు అతని దగ్గరకు తిరిగి వచ్చారు, అతడు వారితో మాట్లాడాడు.
- నిర్గమకాండము 34:32సుమారు క్రీ.పూ. 1491
ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు.
- నిర్గమకాండము 34:33సుమారు క్రీ.పూ. 1491
మోషే వారితో మాట్లాడడం ముగించినప్పుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
- నిర్గమకాండము 34:34సుమారు క్రీ.పూ. 1491
అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు.
- నిర్గమకాండము 34:35సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.
- నిర్గమకాండము 35:1సుమారు క్రీ.పూ. 1491
మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమావేశపరచి వారితో, “మీరు పాటించడానికి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే:
- నిర్గమకాండము 35:2సుమారు క్రీ.పూ. 1491
ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.
- నిర్గమకాండము 35:3సుమారు క్రీ.పూ. 1491
సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.”
- నిర్గమకాండము 35:4సుమారు క్రీ.పూ. 1491
మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటితో, “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:
- నిర్గమకాండము 35:5సుమారు క్రీ.పూ. 1491
మీ దగ్గర ఉన్నదానిలో నుండి యెహోవా కోసం అర్పణ తీసుకురావాలి. ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుక తెచ్చే ప్రతి ఒక్కరు ఇవి తీసుకురావలసినవి: “బంగారం, వెండి, ఇత్తడి;
- నిర్గమకాండము 35:6సుమారు క్రీ.పూ. 1491
నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;
- నిర్గమకాండము 35:7సుమారు క్రీ.పూ. 1491
ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు మన్నికైన తోలు; తుమ్మకర్ర;
- నిర్గమకాండము 35:8సుమారు క్రీ.పూ. 1491
దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;
- నిర్గమకాండము 35:9సుమారు క్రీ.పూ. 1491
ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
- నిర్గమకాండము 35:10సుమారు క్రీ.పూ. 1491
“మీలో నైపుణ్యం ఉన్నవారు వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదీ తయారుచేయాలి:
- నిర్గమకాండము 35:11సుమారు క్రీ.పూ. 1491
“అవేమంటే, సమావేశ గుడారం, దాని గుడారం, దాని పైకప్పు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;
- నిర్గమకాండము 35:12సుమారు క్రీ.పూ. 1491
మందసం, దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత దానిని కప్పివుంచే తెర;
- నిర్గమకాండము 35:13సుమారు క్రీ.పూ. 1491
బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
- నిర్గమకాండము 35:14సుమారు క్రీ.పూ. 1491
వెలుగు కోసం దీపస్తంభం, దాని ఉపకరణాలు, దీపాలు, వెలిగించడానికి ఒలీవనూనె;
- నిర్గమకాండము 35:15సుమారు క్రీ.పూ. 1491
ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం; సమావేశ గుడారపు ద్వారానికి తెర;
- నిర్గమకాండము 35:16సుమారు క్రీ.పూ. 1491
దహనబలిపీఠం దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;