కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 28:21సుమారు క్రీ.పూ. 1056

    అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు భయభ్రాంతులకు గురవ్వడం చూసి, “నా ప్రభువా, నీ సేవకురాలినైన నేను నీ ఆజ్ఞకు లోబడ్డాను. నా ప్రాణాన్ని నా చేతిలో పెట్టుకుని నీవు నాతో చెప్పిన మాటలు విని అలాగే చేశాను.

  2. 1 సమూయేలు 28:22సుమారు క్రీ.పూ. 1056

    ఇప్పుడు నీ సేవకురాలినైన నేను చెప్పే మాటలు విను, నేను నీకు కొంత ఆహారం ఇస్తాను, నీవు భోజనం చేసి బయలుదేరి వెళ్లడానికి బలం తెచ్చుకో” అని అతనితో చెప్పింది.

  3. 1 సమూయేలు 28:23సుమారు క్రీ.పూ. 1056

    కాని అతడు ఒప్పుకోకుండా, “భోజనం చేయను” అని చెప్పాడు. అతని సేవకులు ఆ స్త్రీతో పాటు కలిసి అతని బలవంతం చేసినప్పుడు అతడు వారి మాట విని నేల మీద నుండి లేచి మంచం మీద కూర్చున్నాడు.

  4. 1 సమూయేలు 28:24సుమారు క్రీ.పూ. 1056

    ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న క్రొవ్విన మగ దూడను తెచ్చి త్వరగా వండి పిండి తెచ్చి పిసికి పులియని రొట్టెలు కాల్చింది.

  5. 1 సమూయేలు 28:25సుమారు క్రీ.పూ. 1056

    వాటిని తెచ్చి సౌలుకు అతని సేవకులకు వడ్డించగా వారు భోజనం చేసి ఆ రాత్రే బయలుదేరి వెళ్లిపోయారు.

  6. 1 సమూయేలు 29:1సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయులు తమ సైన్యాన్నంతా సమకూర్చుకొని ఆఫెకులో దిగారు; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట ప్రక్కన బసచేశారు.

  7. 1 సమూయేలు 29:2సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయుల రాజులు తమ సైన్యాలతో వందమంది చొప్పున వెయ్యిమంది చొప్పున వస్తుండగా దావీదు అతని మనుష్యులు ఆకీషుతో కలసి సైన్యం వెనుక వస్తున్నారు.

  8. 1 సమూయేలు 29:3సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయుల సేనాధిపతులు, “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అందుకు ఆకీషు, “ఇతడు ఇశ్రాయేలు రాజైన సౌలు యొక్క అధికారియైన దావీదు కాదా? ఇతడు ఇప్పటికే ఒక సంవత్సరం పాటు నాతో ఉన్నాడు ఇతడు సౌలును విడిచిపెట్టిన రోజు నుండి ఇప్పటివరకు, నేను ఇతనిలో ఎటువంటి తప్పును చూడలేదు” అని వారికి జవాబిచ్చాడు.

  9. 1 సమూయేలు 29:4సుమారు క్రీ.పూ. 1056

    అందుకు ఫిలిష్తీయుల సేనాధిపతులు ఆకీషుమీద కోప్పడి, “నీవు ఇతనికి కేటాయించిన పట్టణానికి ఇతన్ని తిరిగి పంపించు. ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనకే వ్యతిరేకంగా మారతాడేమో! ఇతడు తన యజమాని దయను తిరిగి పొందడానికి మనవారి తలలు తీసుకెళ్లడంకన్నా వేరే మంచి మార్గం ఏముంటుంది?

  10. 1 సమూయేలు 29:5సుమారు క్రీ.పూ. 1056

    “ ‘సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు’ అని వారు నాట్యం చేస్తూ పాటలు పాడింది ఈ దావీదు గురించే కాదా?” అని అతనితో అన్నారు.

  11. 1 సమూయేలు 29:6సుమారు క్రీ.పూ. 1056

    కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.

  12. 1 సమూయేలు 29:7సుమారు క్రీ.పూ. 1056

    కాబట్టి నీవు తిరిగి నీ స్థలానికి సమాధానంగా వెళ్లు; ఫిలిష్తీయుల అధికారులకు కోపం తెప్పించేది ఏది చేయకు” అని అన్నాడు.

  13. 1 సమూయేలు 29:8సుమారు క్రీ.పూ. 1056

    అందుకు దావీదు ఆకీషుతో, “కానీ నేను ఏమి చేశాను? నేను మీ దగ్గరకు వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నీ సేవకునికి వ్యతిరేకంగా నీకు ఏమి దొరికింది? నేను వెళ్లి నా ప్రభువైన రాజు శత్రువులతో ఎందుకు పోరాడలేను?”

  14. 1 సమూయేలు 29:9సుమారు క్రీ.పూ. 1056

    అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.

  15. 1 సమూయేలు 29:10సుమారు క్రీ.పూ. 1056

    కాబట్టి ఉదయం నీవు, నీతో పాటు వచ్చిన నీ యజమాని సేవకులు త్వరగా లేచి, వెలుగు రాగానే వెళ్లండి” అని అన్నాడు.

  16. 1 సమూయేలు 29:11సుమారు క్రీ.పూ. 1056

    కాబట్టి దావీదు అతని మనుష్యులు ఉదయం త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు, మరోవైపు ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు వెళ్లారు.

  17. 1 సమూయేలు 30:1సుమారు క్రీ.పూ. 1056

    దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.

  18. 1 సమూయేలు 30:2సుమారు క్రీ.పూ. 1056

    ఆడవారిని, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అక్కడున్న అందరిని బందీలుగా పట్టుకుని, వారిని చంపకుండా తమతో పాటు తీసుకెళ్లారు.

  19. 1 సమూయేలు 30:3సుమారు క్రీ.పూ. 1056

    దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు.

  20. 1 సమూయేలు 30:4సుమారు క్రీ.పూ. 1056

    ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు.

  21. 1 సమూయేలు 30:5సుమారు క్రీ.పూ. 1056

    దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు.

  22. 1 సమూయేలు 30:6సుమారు క్రీ.పూ. 1056

    అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

  23. 1 సమూయేలు 30:7సుమారు క్రీ.పూ. 1056

    తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు.

  24. 1 సమూయేలు 30:8సుమారు క్రీ.పూ. 1056

    అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.

  25. 1 సమూయేలు 30:9సుమారు క్రీ.పూ. 1056

    కాబట్టి దావీదు అతనితో ఉన్న ఆరువందలమంది బయలుదేరి బెసోరు వాగు దగ్గరకు రాగా వారిలో రెండువందలమంది వెనుక ఉండిపోయారు.