కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 31:4సుమారు క్రీ.పూ. 1056

    సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.

  2. 1 సమూయేలు 31:5సుమారు క్రీ.పూ. 1056

    ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.

  3. 1 సమూయేలు 31:6సుమారు క్రీ.పూ. 1056

    ఇలా సౌలు అతని ముగ్గురు కుమారులు అతని ఆయుధాలను మోసేవాడు అతని మనుష్యులందరు ఒకేసారి చనిపోయారు.

  4. 1 సమూయేలు 31:7సుమారు క్రీ.పూ. 1056

    ఇశ్రాయేలు సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.

  5. 1 సమూయేలు 31:8సుమారు క్రీ.పూ. 1056

    మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కుమారులను చూశారు.

  6. 1 సమూయేలు 31:9సుమారు క్రీ.పూ. 1056

    అతని తల నరికి అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాలున్న గుడిలో, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.

  7. 1 సమూయేలు 31:10సుమారు క్రీ.పూ. 1056

    వారు అతని ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో పెట్టి అతని శవాన్ని బేత్-షాను పట్టణపు గోడకు తగిలించారు.

  8. 1 సమూయేలు 31:11సుమారు క్రీ.పూ. 1056

    అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు ప్రజలు విన్నప్పుడు,

  9. 1 సమూయేలు 31:12సుమారు క్రీ.పూ. 1056

    వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు.

  10. 1 సమూయేలు 31:13సుమారు క్రీ.పూ. 1056

    తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.