Skip to content

Ramah

13 verses

31.8300, 35.1800 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Ramah ను ప్రస్తావించే వచనాలు

  1. మరుసటిరోజు తెల్లవారుజామున వారు లేచి యెహోవా ఎదుట ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఎల్కానా తన భార్యయైన హన్నాను లైంగికంగా కలుసుకున్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు.

  2. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు.

  3. అయితే అతని ఇల్లు రామాలో ఉంది కాబట్టి అక్కడికి తిరిగివచ్చి అక్కడ కూడా ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.

  4. కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు.

  5. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు కాని సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు.

  6. కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.

  7. అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.

  8. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వార్త వచ్చినప్పుడు,

  9. చివరిగా, తానే రామాకు బయలుదేరి వెళ్లి సేకు దగ్గర ఉన్న పెద్ద బావి దగ్గరకు వచ్చి, “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. వారు అతనితో, “రామా దగ్గర ఉన్న నాయోతులో ఉన్నారు” అని చెప్పారు.

  10. అతడు రామా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి కూడా వచ్చినందున అతడు నాయోతు చేరుకునేంత వరకు ప్రవచిస్తూనే నడిచాడు.

  11. తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.

  12. కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.

  13. సమూయేలు చనిపోగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు అతని గురించి దుఃఖించి అతని పట్టణమైన రామాలో అతన్ని సమాధి చేశారు. గతంలో సౌలు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని దేశం నుండి వెళ్లగొట్టాడు.