Altars గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు.
యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.
అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.
కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.
దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు.
ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు.
అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
దేవుడు యాకోబుతో, “నీవు లేచి, బేతేలుకు వెళ్లి, అక్కడ స్థిరపడు, నీవు నీ సోదరుడైన ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు” అని అన్నారు.
తర్వాత నాతో బేతేలుకు రండి, అక్కడ నా శ్రమ దినాన నాకు జవాబిచ్చిన దేవునికి బలిపీఠం కడతాను.”
అక్కడా అతడు బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్ బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు ఇక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు.
మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టారు.
“ ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
ఒకవేళ మీరు నా కోసం రాళ్లతో బలిపీఠం కడితే, దానిని చెక్కిన రాళ్లతో కట్టవద్దు, ఎందుకంటే వాటిపైన మీరు పనిముట్టు ఉపయోగిస్తే అది అపవిత్రం అవుతుంది.
నా బలిపీఠం దగ్గరకు మెట్లు ఎక్కి వెళ్లవద్దు, ఎందుకంటే మీ లోపలి అవయవాలు కనబడతాయి.’
అయితే ఒకవేళ ఎవరైనా ఎవరినైన కావాలని కుట్రచేసి చంపితే, ఆ వ్యక్తిని నా బలిపీఠం దగ్గర నుండి ఈడ్చుకు వెళ్లి చంపివేయాలి.
అప్పుడు మోషే యెహోవా చెప్పిన వాటన్నిటిని వ్రాశాడు. మరుసటిరోజు ఉదయానే లేచి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలను బట్టి పన్నెండు స్తంభాలను నిలబెట్టాడు.
“తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి.
కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి.
దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.
దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి,
ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి.
బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి.
బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.
“ధూపం వేయడానికి నీవు తుమ్మకర్రతో ఒక వేదిక తయారుచేయాలి.