Skip to content

Altars గురించి బైబిల్ వచనాలు

89 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

  2. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.

  3. కాబట్టి యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు నుండి పంపిన నమూనా ప్రకారం బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.

  4. రాజు దమస్కు నుండి తిరిగివచ్చి ఆ బలిపీఠాన్ని చూసి, దానిని సమీపించి, దాని మీద బలి అర్పించాడు.

  5. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.

  6. అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు.

  7. హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.

  8. దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు,

  9. అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు.

  10. వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు.

  11. వారు తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ నా ముఖం మీద నాకు కోపం తెప్పించిన ప్రజలు;

  12. యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”

  13. ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు.

  14. నేను చుట్టూ తిరుగుతూ మీరు పూజించే వాటిని జాగ్రత్తగా చూసినప్పుడు నాకు కనబడిన ఒక బలిపీఠం మీద, తెలియని దేవునికి, అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక ఆరాధిస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను.