కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 30:10సుమారు క్రీ.పూ. 1056

    ఆ రెండువందలమంది అలసిపోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు కానీ దావీదు నాలుగువందలమంది ఇంకా తరుముతూ వెళ్లారు.

  2. 1 సమూయేలు 30:11సుమారు క్రీ.పూ. 1056

    పొలంలో ఒక ఈజిప్టువాడు కనబడగా వారు అతన్ని దావీదు దగ్గరకు తీసుకువచ్చి వానికి త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఇచ్చారు.

  3. 1 సమూయేలు 30:12సుమారు క్రీ.పూ. 1056

    అంజూర ముద్దలో ముక్క రెండు ద్రాక్షగుత్తులు ఇచ్చారు. అతడు మూడు పగళ్ళు మూడు రాత్రులు తిండిలేకుండా ఉండడంతో వాటిని తిన్న తర్వాత అతడు కోలుకున్నాడు.

  4. 1 సమూయేలు 30:13సుమారు క్రీ.పూ. 1056

    అప్పుడు దావీదు, “నీది ఏ దేశం? ఎక్కడ నుండి వచ్చావు?” అని అతన్ని అడిగాడు. అందుకు అతడు, “ఈజిప్టుకు చెందిన నేను ఒక అమాలేకీయునికి బానిసను. మూడు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేదని నా యజమాని నన్ను వదిలేశాడు.

  5. 1 సమూయేలు 30:14సుమారు క్రీ.పూ. 1056

    మేము దాడిచేసి కెరేతీయుల దక్షిణ దేశాన్ని యూదా దేశాన్ని కాలేబు దక్షిణ దేశాన్ని దోచుకొని సిక్లగును కాల్చివేశాము” అని చెప్పాడు.

  6. 1 సమూయేలు 30:15సుమారు క్రీ.పూ. 1056

    “ఆ దోపిడి మూక దగ్గరకు నీవు నాకు దారి చూపిస్తావా?” అని దావీదు అడిగాడు. అప్పుడు వాడు, “నీవు నన్ను చంపవని నా యజమానికి అప్పగించనని దేవుని మీద నాకు ప్రమాణము చేస్తే ఆ గుంపును కలుసుకోడానికి నీకు దారి చూపిస్తాను” అన్నాడు.

  7. 1 సమూయేలు 30:16సుమారు క్రీ.పూ. 1056

    తర్వాత వాడు దావీదును వారున్న చోటికి తీసుకెళ్లగా, వారంతా ఆ ప్రాంతంలో చెదిరిపోయి ఫిలిష్తీయుల దేశంలో యూదా దేశంలో తాము దోచుకున్న సొమ్ముతో తింటూ త్రాగుతూ ఆటపాటలలో మునిగిపోయారు.

  8. 1 సమూయేలు 30:17సుమారు క్రీ.పూ. 1056

    దావీదు సాయంత్రం మొదలుపెట్టి మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యువకులు తప్ప మరియెవరూ తప్పించుకోలేకపోయారు.

  9. 1 సమూయేలు 30:18సుమారు క్రీ.పూ. 1056

    దావీదు అమాలేకీయులు దోచుకున్న ప్రతిదాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. తన ఇద్దరు భార్యలను కూడా రక్షించాడు.

  10. 1 సమూయేలు 30:19సుమారు క్రీ.పూ. 1056

    చిన్నవారు పెద్దవారు, కుమారులు కుమార్తెలు లేదా వారు దోచుకున్న వాటన్నిటిలో ఏదీ తక్కువ కాకుండా దావీదు అన్నిటిని తిరిగి తీసుకువచ్చాడు.

  11. 1 సమూయేలు 30:20సుమారు క్రీ.పూ. 1056

    దావీదు అమాలేకీయుల గొర్రెలు పశువులన్నిటిని తీసుకున్నాడు; “ఇది దావీదు దోపుడుసొమ్ము” అని చెబుతూ అతని మనుష్యులు వాటిని మిగిలిన పశువులకు ముందుగా తోలారు.

  12. 1 సమూయేలు 30:21సుమారు క్రీ.పూ. 1056

    అలసిపోయి దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన ఆ రెండువందలమంది దగ్గరకు దావీదు రాగా వారు దావీదును అతనితో ఉన్న మనుష్యులను కలుసుకోడానికి వచ్చారు. దావీదు వారి దగ్గరకు వచ్చి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.

  13. 1 సమూయేలు 30:22సుమారు క్రీ.పూ. 1056

    కాని దావీదుతో పాటు వెళ్లిన వారిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఇబ్బందులు కలుగజేసేవారు, “వీరు మనతో పాటు రాలేదు కాబట్టి వారి భార్యలను, పిల్లలను తప్ప మనం తిరిగి తెచ్చిన దోపుడు సొమ్ములో వీరికి ఏ భాగం ఇవ్వనవసరం లేదు” అన్నారు.

  14. 1 సమూయేలు 30:23సుమారు క్రీ.పూ. 1056

    అందుకు దావీదు వారితో, “నా సోదరులారా; యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దోపిడి మూకను మనకు అప్పగించి మనకు దయ చేసిన దాని విషయంలో మీరు ఇలా చేయకూడదు.

  15. 1 సమూయేలు 30:24సుమారు క్రీ.పూ. 1056

    మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధానికి వెళ్లిన వారికి ఎంత భాగం వస్తుందో సామాను దగ్గర ఉన్నవారికి అంతే భాగం వస్తుంది కదా! కాబట్టి అందరికి సమానభాగాలు వస్తాయి” అన్నాడు.

  16. 1 సమూయేలు 30:25సుమారు క్రీ.పూ. 1056

    ఆ రోజు నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలుకు దానిని ఒక కట్టడగాను, నియమంగాను చేశాడు.

  17. 1 సమూయేలు 30:26సుమారు క్రీ.పూ. 1056

    దావీదు సిక్లగుకు వచ్చినప్పుడు దోచుకున్న సొమ్ములో కొంత తీసి, “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకున్న సొమ్ములో కొంత మీకు ఒక కానుకగా ఇస్తున్నాను” అని చెప్పి తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు.

  18. 1 సమూయేలు 30:27సుమారు క్రీ.పూ. 1056

    దావీదు దానిని బేతేలులో దక్షిణ రామోతులో యత్తీరులో ఉన్నవారికి,

  19. 1 సమూయేలు 30:28సుమారు క్రీ.పూ. 1056

    అరోయేరులో, షిప్మోతులో, ఎష్తెమోవాలో ఉన్నవారికి,

  20. 1 సమూయేలు 30:29సుమారు క్రీ.పూ. 1056

    రాకాలులో యెరహ్మెయేలీయుల కెనీయుల పట్టణాల్లో ఉన్నవారికి,

  21. 1 సమూయేలు 30:30సుమారు క్రీ.పూ. 1056

    హోర్మాలో బోర్-ఆషానులో అతాకులో ఉన్నవారికి,

  22. 1 సమూయేలు 30:31సుమారు క్రీ.పూ. 1056

    హెబ్రోనులో ఉన్నవారికి, దావీదు అతని మనుష్యులు తిరిగిన అన్ని స్థలాల్లో ఉన్న పెద్దలకు పంపించాడు.

  23. 1 సమూయేలు 31:1సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు. చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు.

  24. 1 సమూయేలు 31:2సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను అబీనాదాబు మల్కీ-షూవలను చంపేశారు.

  25. 1 సమూయేలు 31:3సుమారు క్రీ.పూ. 1056

    సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.