- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 26:8సుమారు క్రీ.పూ. 1060
అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.
- 1 సమూయేలు 26:9సుమారు క్రీ.పూ. 1060
అయితే దావీదు అబీషైతో, “అతన్ని చంపవద్దు, యెహోవా అభిషేకించిన వానిని చంపినవారు నిర్దోషులుగా ఉండగలరా?
- 1 సమూయేలు 26:10సుమారు క్రీ.పూ. 1060
దావీదు ఇంకా మాట్లాడుతూ, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, యెహోవాయే అతన్ని శిక్షిస్తారు. అతని సమయం వచ్చినప్పుడు అతడే చనిపోతాడు లేదా యుద్ధంలో నశిస్తాడు.
- 1 సమూయేలు 26:11సుమారు క్రీ.పూ. 1060
అయితే యెహోవా అభిషేకించిన వానిపైకి నేను చేయి ఎత్తకుండ యెహోవా నన్ను ఆపివేయును గాక. అతని తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకుని మనం వెళ్లిపోదాం రా” అని చెప్పాడు.
- 1 సమూయేలు 26:12సుమారు క్రీ.పూ. 1060
దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు.
- 1 సమూయేలు 26:13సుమారు క్రీ.పూ. 1060
తర్వాత దావీదు అవతలి వైపుకు వెళ్లి దూరంగా కొండమీద నిలబడ్డాడు, వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది.
- 1 సమూయేలు 26:14సుమారు క్రీ.పూ. 1060
దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు. అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు.
- 1 సమూయేలు 26:15సుమారు క్రీ.పూ. 1060
అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.
- 1 సమూయేలు 26:16సుమారు క్రీ.పూ. 1060
నీవు చేసింది సరియైనది కాదు, యెహోవా అభిషేకించిన నీ యజమానికి నీవు రక్షణ ఇవ్వలేకపోయావు కాబట్టి సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నీ మనుష్యులు తప్పకుండా చావాలి. రాజు తల దగ్గర ఉండాల్సిన అతని ఈటె, నీళ్ల కూజా ఎక్కడ ఉన్నాయి?” అన్నాడు.
- 1 సమూయేలు 26:17సుమారు క్రీ.పూ. 1060
సౌలు దావీదు స్వరం గుర్తుపట్టి, “దావీదూ నా కుమారుడా, ఇది నీ స్వరమేనా?” అని అడిగాడు. అందుకు దావీదు, “నా ప్రభువా, రాజా, అవును ఇది నా స్వరమే.
- 1 సమూయేలు 26:18సుమారు క్రీ.పూ. 1060
నా ప్రభువు తన సేవకుడిని ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేశాను? నేను చేసిన తప్పేంటి?
- 1 సమూయేలు 26:19సుమారు క్రీ.పూ. 1060
ఇప్పుడు నా ప్రభువైన రాజు తన సేవకుని మాటలు వినాలి. ఒకవేళ యెహోవాయే మిమ్మల్ని నా మీదికి రెచ్చగొట్టి ఉంటే, ఆయన నా అర్పణను అంగీకరించును గాక. కానీ ఒకవేళ ఇది మనుష్యుల కుట్ర అయితే అందులో ఉన్నవారిని యెహోవా శపించును గాక! ఈ రోజు వారు యెహోవా వారసత్వంలో నా వాటా నుండి నన్ను వెలివేసి, ‘వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించు’ అని అన్నారు.
- 1 సమూయేలు 26:20సుమారు క్రీ.పూ. 1060
యెహోవా సన్నిధికి దూరంగా నా రక్తం నేలపై పడకూడదు. ఒకడు పర్వతాల్లో కౌజుపిట్టను వేటాడినట్లు ఇశ్రాయేలు రాజు ఈగను వెదకడానికి బయటకు వచ్చాడు” అని అన్నాడు.
- 1 సమూయేలు 26:21సుమారు క్రీ.పూ. 1060
అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.
- 1 సమూయేలు 26:22సుమారు క్రీ.పూ. 1060
అప్పుడు దావీదు, “రాజా, ఇదిగో రాజు ఈటె ఇక్కడ ఉంది, నీ పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకెళ్లవచ్చు.
- 1 సమూయేలు 26:23సుమారు క్రీ.పూ. 1060
యెహోవా ప్రతిఒక్కరికి వారి నీతికి నమ్మకత్వానికి బహుమానం ఇస్తారు. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించారు కాని, యెహోవా అభిషేకించిన వాని మీద నేను చేయి వేయను.
- 1 సమూయేలు 26:24సుమారు క్రీ.పూ. 1060
ఈ రోజు నీ ప్రాణానికి విలువను ఇచ్చినందుకు యెహోవా నా ప్రాణానికి విలువనిచ్చి అన్ని బాధలనుండి నన్ను విడిపించును గాక” అని చెప్పాడు.
- 1 సమూయేలు 26:25సుమారు క్రీ.పూ. 1060
అందుకు సౌలు దావీదుతో, “దావీదూ, నా కుమారుడా, నీవు దీవించబడుదువు గాక; నీవు గొప్ప పనులు చేస్తావు, ఖచ్చితంగా విజయం పొందుతావు” అన్నాడు. తర్వాత దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు, సౌలు తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు.
- 1 సమూయేలు 27:1సుమారు క్రీ.పూ. 1058
అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
- 1 సమూయేలు 27:2సుమారు క్రీ.పూ. 1058
కాబట్టి దావీదు తనతో ఉన్న ఆరువందలమంది పురుషులతో బయలుదేరి మాయోకు కుమారుడు గాతు రాజైన ఆకీషు దగ్గరకు వెళ్లాడు.
- 1 సమూయేలు 27:3సుమారు క్రీ.పూ. 1058
దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు.
- 1 సమూయేలు 27:4సుమారు క్రీ.పూ. 1058
దావీదు గాతుకు పారిపోయాడని సౌలుకు తెలిసిన తర్వాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
- 1 సమూయేలు 27:5సుమారు క్రీ.పూ. 1058
అప్పుడు దావీదు ఆకీషుతో, “రాజనగరంలో నీతో పాటు నీ సేవకుడనైన నేను ఉండడం ఎందుకు? నీకు నాపై దయ ఉంటే నేను నివసించడానికి బయట పట్టణాల్లో ఒకదానిలో నాకు స్థలం ఇవ్వండి” అని అడిగాడు.
- 1 సమూయేలు 27:6సుమారు క్రీ.పూ. 1058
కాబట్టి ఆకీషు ఆ రోజే సిక్లగు అనే పట్టణాన్ని అతనికిచ్చాడు. అప్పటినుండి నేటివరకు సిక్లగు యూదా రాజులకు చెందినదిగానే ఉంది.
- 1 సమూయేలు 27:7సుమారు క్రీ.పూ. 1058
దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.