- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 25:2సుమారు క్రీ.పూ. 1060
కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు.
- 1 సమూయేలు 25:3సుమారు క్రీ.పూ. 1060
అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.
- 1 సమూయేలు 25:4సుమారు క్రీ.పూ. 1060
నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని,
- 1 సమూయేలు 25:5సుమారు క్రీ.పూ. 1060
దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.
- 1 సమూయేలు 25:6సుమారు క్రీ.పూ. 1060
అతనితో ఇలా చెప్పండి, ‘నీకు దీర్ఘాయువు కలుగును గాక! నీకు నీ ఇంటివారికి నీకు చెందినవాటన్నిటికి క్షేమం కలుగును గాక!
- 1 సమూయేలు 25:7సుమారు క్రీ.పూ. 1060
“ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.
- 1 సమూయేలు 25:8సుమారు క్రీ.పూ. 1060
నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”
- 1 సమూయేలు 25:9సుమారు క్రీ.పూ. 1060
దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.
- 1 సమూయేలు 25:10సుమారు క్రీ.పూ. 1060
నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.
- 1 సమూయేలు 25:11సుమారు క్రీ.పూ. 1060
నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.
- 1 సమూయేలు 25:12సుమారు క్రీ.పూ. 1060
దావీదు సేవకులు వచ్చిన దారినే తిరిగివెళ్లి నాబాలు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పారు.
- 1 సమూయేలు 25:13సుమారు క్రీ.పూ. 1060
అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.
- 1 సమూయేలు 25:14సుమారు క్రీ.పూ. 1060
సేవకులలో ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో, “అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి శుభాలు చెప్పమని దూతలను పంపితే అతడు వారిని అవమానించి మాట్లాడాడు.
- 1 సమూయేలు 25:15సుమారు క్రీ.పూ. 1060
అయితే ఆ మనుష్యులు మా పట్ల చాలా మంచిగా ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య ఉన్నంత కాలం మాకు ఏ హాని చేయలేదు, మేమేమి పోగొట్టుకోలేదు.
- 1 సమూయేలు 25:16సుమారు క్రీ.పూ. 1060
వారి దగ్గర మేము గొర్రెలను మేపుతున్నంత కాలం వారు రాత్రి పగలు మా చుట్టూ ఒక గోడలా ఉన్నారు.
- 1 సమూయేలు 25:17సుమారు క్రీ.పూ. 1060
ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.
- 1 సమూయేలు 25:18సుమారు క్రీ.పూ. 1060
అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.
- 1 సమూయేలు 25:19సుమారు క్రీ.పూ. 1060
ఆమె తన సేవకులతో, “మీరు ముందు వెళ్లండి, నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది. అయితే ఆమె తన భర్తయైన నాబాలుతో ఏమీ చెప్పలేదు.
- 1 సమూయేలు 25:20సుమారు క్రీ.పూ. 1060
ఆమె తన గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా, దావీదు అతని మనుష్యులు ఆమెకు ఎదురువచ్చారు. అప్పుడు ఆమె వారిని కలిసింది.
- 1 సమూయేలు 25:21సుమారు క్రీ.పూ. 1060
అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు.
- 1 సమూయేలు 25:22సుమారు క్రీ.పూ. 1060
రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.
- 1 సమూయేలు 25:23సుమారు క్రీ.పూ. 1060
అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది.
- 1 సమూయేలు 25:24సుమారు క్రీ.పూ. 1060
ఆమె అతని పాదాల మీద పడి, “నా ప్రభువా, తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను; మీ సేవకురాలినైన నన్ను మాట్లాడనివ్వండి, మీ సేవకురాలి మాట వినండి.
- 1 సమూయేలు 25:25సుమారు క్రీ.పూ. 1060
నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు.
- 1 సమూయేలు 25:26సుమారు క్రీ.పూ. 1060
నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.