- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 23:28సుమారు క్రీ.పూ. 1061
సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు.
- 1 సమూయేలు 23:29సుమారు క్రీ.పూ. 1061
తర్వాత దావీదు అక్కడినుండి బయలుదేరి ఎన్-గేదీకి వచ్చి కొండ ప్రాంతంలో నివసించాడు.
- 1 సమూయేలు 24:1సుమారు క్రీ.పూ. 1061
సౌలు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగివచ్చిన తర్వాత, “దావీదు ఎన్-గేదీ ఎడారిలో ఉన్నాడు” అని అతనికి వార్త వచ్చింది.
- 1 సమూయేలు 24:2సుమారు క్రీ.పూ. 1061
కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడువేలమంది యువకులను ఏర్పరచుకొని కొండమేకలు ఉండే రాతి గుట్టలలో దావీదును అతని ప్రజలను వెదకడానికి బయలుదేరాడు.
- 1 సమూయేలు 24:3సుమారు క్రీ.పూ. 1061
దారిలో గొర్రెల దొడ్ల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. సౌలు మూత్ర విసర్జన కోసం దాని లోపలికి వెళ్లాడు. ఆ గుహలో చాలా లోపల దావీదు అతని మనుష్యులు ఉన్నారు.
- 1 సమూయేలు 24:4సుమారు క్రీ.పూ. 1061
ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు.
- 1 సమూయేలు 24:5సుమారు క్రీ.పూ. 1061
కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి,
- 1 సమూయేలు 24:6సుమారు క్రీ.పూ. 1061
“ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు.
- 1 సమూయేలు 24:7సుమారు క్రీ.పూ. 1061
ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు.
- 1 సమూయేలు 24:8సుమారు క్రీ.పూ. 1061
అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు.
- 1 సమూయేలు 24:9సుమారు క్రీ.పూ. 1061
అతడు సౌలుతో ఇలా అన్నాడు, “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు?
- 1 సమూయేలు 24:10సుమారు క్రీ.పూ. 1061
గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను.
- 1 సమూయేలు 24:11సుమారు క్రీ.పూ. 1061
చూడు, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ వస్త్రాన్ని చూడు! నేను మీ వస్త్రపు అంచును కత్తిరించాను, కానీ నిన్ను చంపలేదు. నేను తప్పు చేశాను అనడానికి గాని తిరుగుబాటు చేశాను అని సూచించడానికి నా చేతిలో ఏమీ లేదని చూడండి. నేను నీకు అన్యాయం చేయలేదు, కానీ నీవు నా ప్రాణం తీయడానికి నన్ను తరుముతున్నావు.
- 1 సమూయేలు 24:12సుమారు క్రీ.పూ. 1061
నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు.
- 1 సమూయేలు 24:13సుమారు క్రీ.పూ. 1061
పాత సామెత చెప్పినట్లుగా, ‘దుర్మార్గుల నుండి దుర్మార్గమైనవే వస్తాయి’ కాబట్టి నా చేయి నిన్ను తాకదు.
- 1 సమూయేలు 24:14సుమారు క్రీ.పూ. 1061
“ఇశ్రాయేలు రాజు ఎవరి మీదికి వచ్చాడు? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? చచ్చిన కుక్కనా? ఈగనా?
- 1 సమూయేలు 24:15సుమారు క్రీ.పూ. 1061
యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.
- 1 సమూయేలు 24:16సుమారు క్రీ.పూ. 1061
దావీదు ఇలా చెప్పడం ముగించినప్పుడు సౌలు, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు,
- 1 సమూయేలు 24:17సుమారు క్రీ.పూ. 1061
అతడు దావీదుతో, “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను.
- 1 సమూయేలు 24:18సుమారు క్రీ.పూ. 1061
నీవు నాకు చేసిన మంచి గురించి ఈ రోజు నాకు చెప్పావు; యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నీవు నన్ను చంపలేదు.
- 1 సమూయేలు 24:19సుమారు క్రీ.పూ. 1061
ఒకడు తన శత్రువును కనుగొన్నప్పుడు, అతడు అతన్ని క్షేమంగా తప్పించుకోనిస్తాడా? ఈ రోజు నీవు నాతో ప్రవర్తించిన తీరుకు యెహోవా నీకు మంచి ప్రతిఫలమివ్వాలి.
- 1 సమూయేలు 24:20సుమారు క్రీ.పూ. 1061
తప్పకుండా నీవు రాజవుతావని, ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్ధిరపరచబడుతుందని నాకు తెలుసు.
- 1 సమూయేలు 24:21సుమారు క్రీ.పూ. 1061
కాబట్టి నీవు నా సంతానాన్ని చంపనని నా తండ్రి కుటుంబం నుండి నా పేరును కొట్టివేయనని యెహోవా పేరిట నాకు ప్రమాణం చేయి” అన్నాడు.
- 1 సమూయేలు 24:22సుమారు క్రీ.పూ. 1061
అప్పుడు దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత సౌలు ఇంటికి తిరిగి వచ్చాడు; దావీదు అతని ప్రజలు తామున్న కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
- 1 సమూయేలు 25:1సుమారు క్రీ.పూ. 1060
కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.