కంటెంట్‌కు వెళ్లండి

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 13:6సుమారు క్రీ.పూ. 1918

    వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు.

  2. ఆదికాండము 13:7సుమారు క్రీ.పూ. 1918

    అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు.

  3. ఆదికాండము 13:8సుమారు క్రీ.పూ. 1918

    కాబట్టి అబ్రాము లోతుతో, “మనం సమీప బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం కలిగి ఉండడం మంచిది కాదు.

  4. ఆదికాండము 13:9సుమారు క్రీ.పూ. 1918

    ఈ దేశమంతా నీ ముందు లేదా? మనం విడిపోదాము. నీవు ఈ భూభాగంలో ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను; నీవు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను” అని అన్నాడు.

  5. ఆదికాండము 13:10సుమారు క్రీ.పూ. 1918

    లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.)

  6. ఆదికాండము 13:11సుమారు క్రీ.పూ. 1917

    కాబట్టి లోతు యొర్దాను మైదాన ప్రాంతమంతా తన కోసం ఎంచుకుని తూర్పు వైపు వెళ్లిపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు:

  7. ఆదికాండము 13:12సుమారు క్రీ.పూ. 1917

    అబ్రాము కనాను దేశంలో నివసించాడు, లోతు మైదాన పట్టణాల మధ్య నివసిస్తూ, సొదొమ దగ్గర గుడారాలు వేసుకున్నాడు.

  8. ఆదికాండము 13:13సుమారు క్రీ.పూ. 1917

    అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.

  9. ఆదికాండము 13:14సుమారు క్రీ.పూ. 1917

    లోతు అబ్రాము నుండి విడిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో, “నీవున్న చోట నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలు చూడు.

  10. ఆదికాండము 13:15సుమారు క్రీ.పూ. 1917

    నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను.

  11. ఆదికాండము 13:16సుమారు క్రీ.పూ. 1917

    నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను.

  12. ఆదికాండము 13:17సుమారు క్రీ.పూ. 1917

    నీవు లేచి దేశం యొక్క అన్ని దిక్కులకు వెళ్లు, అదంతా నేను నీకు ఇస్తున్నాను” అని అన్నారు.

  13. ఆదికాండము 13:18సుమారు క్రీ.పూ. 1917

    కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.

  14. ఆదికాండము 14:1సుమారు క్రీ.పూ. 1913

    అమ్రాపేలు షీనారు యొక్క రాజుగా ఉన్న కాలంలో, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు,

  15. ఆదికాండము 14:2సుమారు క్రీ.పూ. 1913

    ఈ రాజులు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిము రాజైన షెమేబెరుతోను బేల (సోయరు) రాజుతోను యుద్ధం చేశారు.

  16. ఆదికాండము 14:3సుమారు క్రీ.పూ. 1913

    ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర లోయలో) కూడుకున్నారు.

  17. ఆదికాండము 14:4సుమారు క్రీ.పూ. 1913

    వారంతా పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు సేవ చేశారు, కానీ పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.

  18. ఆదికాండము 14:5సుమారు క్రీ.పూ. 1913

    పద్నాలుగవ సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితో పొత్తు పెట్టుకున్న రాజులు కలిసి అష్తారోతు కర్నాయింలో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిములో ఎమీయులను

  19. ఆదికాండము 14:6సుమారు క్రీ.పూ. 1913

    హోరీయులను, శేయీరు కొండ సీమలో ఎడారి దగ్గర ఉన్న ఎల్ పారాను వరకు తరిమి ఓడించారు.

  20. ఆదికాండము 14:7సుమారు క్రీ.పూ. 1913

    తర్వాత అక్కడినుండి వెనుకకు తిరిగి ఎన్ మిష్పాతు అనబడిన కాదేషుకు వెళ్లి, అమాలేకీయుల భూభాగమంతా, హససోన్ తామారులో నివసిస్తున్న అమోరీయుల భూభాగమంతా జయించారు.

  21. ఆదికాండము 14:8సుమారు క్రీ.పూ. 1913

    అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో,

  22. ఆదికాండము 14:9సుమారు క్రీ.పూ. 1913

    ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు.

  23. ఆదికాండము 14:10సుమారు క్రీ.పూ. 1913

    సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు.

  24. ఆదికాండము 14:11సుమారు క్రీ.పూ. 1913

    ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు.

  25. ఆదికాండము 14:12సుమారు క్రీ.పూ. 1913

    అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు.