- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 15:14సుమారు క్రీ.పూ. 1911
అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు.
- ఆదికాండము 15:15సుమారు క్రీ.పూ. 1911
నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.
- ఆదికాండము 15:16సుమారు క్రీ.పూ. 1911
నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”
- ఆదికాండము 15:17సుమారు క్రీ.పూ. 1911
సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి.
- ఆదికాండము 15:18సుమారు క్రీ.పూ. 1911
ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే,
- ఆదికాండము 15:19సుమారు క్రీ.పూ. 1911
కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు,
- ఆదికాండము 15:20సుమారు క్రీ.పూ. 1911
హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు,
- ఆదికాండము 15:21సుమారు క్రీ.పూ. 1911
అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు.
- ఆదికాండము 16:1సుమారు క్రీ.పూ. 1912
అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు;
- ఆదికాండము 16:2సుమారు క్రీ.పూ. 1912
కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు.
- ఆదికాండము 16:3సుమారు క్రీ.పూ. 1911
అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.
- ఆదికాండము 16:4సుమారు క్రీ.పూ. 1911
అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.
- ఆదికాండము 16:5సుమారు క్రీ.పూ. 1911
అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.
- ఆదికాండము 16:6సుమారు క్రీ.పూ. 1911
అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది.
- ఆదికాండము 16:7సుమారు క్రీ.పూ. 1911
యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ.
- ఆదికాండము 16:8సుమారు క్రీ.పూ. 1911
ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది.
- ఆదికాండము 16:9సుమారు క్రీ.పూ. 1911
అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు.
- ఆదికాండము 16:10సుమారు క్రీ.పూ. 1911
యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు.
- ఆదికాండము 16:11సుమారు క్రీ.పూ. 1911
యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.
- ఆదికాండము 16:12సుమారు క్రీ.పూ. 1911
అతడు ఒక అడవి గాడిదలాంటి మనుష్యుడు; అందరితో అతడు విరోధం పెట్టుకుంటాడు, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, అతడు తన సోదరులందరితో శత్రుత్వం కలిగి జీవిస్తాడు.”
- ఆదికాండము 16:13సుమారు క్రీ.పూ. 1911
ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది.
- ఆదికాండము 16:14సుమారు క్రీ.పూ. 1911
అందుకే ఆ బావికి బెయేర్-లహాయి-రోయి అని పేరు వచ్చింది; అది కాదేషు బెరెదు మధ్యలో ఇప్పటికి ఉంది.
- ఆదికాండము 16:15సుమారు క్రీ.పూ. 1910
హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
- ఆదికాండము 16:16సుమారు క్రీ.పూ. 1910
హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.
- ఆదికాండము 17:1సుమారు క్రీ.పూ. 1897
అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.