- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 17:27సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు.
- ఆదికాండము 18:1సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు.
- ఆదికాండము 18:2సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.
- ఆదికాండము 18:3సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి.
- ఆదికాండము 18:4సుమారు క్రీ.పూ. 1897
నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి.
- ఆదికాండము 18:5సుమారు క్రీ.పూ. 1897
మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు. “మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు.
- ఆదికాండము 18:6సుమారు క్రీ.పూ. 1897
కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు.
- ఆదికాండము 18:7సుమారు క్రీ.పూ. 1897
తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు.
- ఆదికాండము 18:8సుమారు క్రీ.పూ. 1897
తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు.
- ఆదికాండము 18:9సుమారు క్రీ.పూ. 1897
“నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
- ఆదికాండము 18:10సుమారు క్రీ.పూ. 1897
అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది.
- ఆదికాండము 18:11సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది.
- ఆదికాండము 18:12సుమారు క్రీ.పూ. 1897
శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది.
- ఆదికాండము 18:13సుమారు క్రీ.పూ. 1897
అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’
- ఆదికాండము 18:14సుమారు క్రీ.పూ. 1897
యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు.
- ఆదికాండము 18:15సుమారు క్రీ.పూ. 1897
శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది. “లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు.
- ఆదికాండము 18:16సుమారు క్రీ.పూ. 1897
ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు.
- ఆదికాండము 18:17సుమారు క్రీ.పూ. 1897
అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను?
- ఆదికాండము 18:18సుమారు క్రీ.పూ. 1897
అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.
- ఆదికాండము 18:19సుమారు క్రీ.పూ. 1897
ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”
- ఆదికాండము 18:20సుమారు క్రీ.పూ. 1897
అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది.
- ఆదికాండము 18:21సుమారు క్రీ.పూ. 1897
నేను అక్కడికి వెళ్లి నాకు చేరిన ఫిర్యాదు వలె వారి క్రియలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూసి తెలుసుకుంటాను” అని అన్నారు.
- ఆదికాండము 18:22సుమారు క్రీ.పూ. 1897
ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు.
- ఆదికాండము 18:23సుమారు క్రీ.పూ. 1897
అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా?
- ఆదికాండము 18:24సుమారు క్రీ.పూ. 1897
ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా నిజంగా దానిని నాశనం చేస్తారా?