కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు ఎక్కడ దాడి చేసినా అక్కడ మగవారిని ఆడవారిని ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు, కాని గొర్రెలను ఎద్దులను గాడిదలను ఒంటెలను వస్త్రాలను దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరకు వచ్చేవాడు.

  2. ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని చెప్పాడు.

  3. దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు.

  4. దావీదును నమ్మిన ఆకీషు, “ఇతనికి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చాలా అసహ్యం ఏర్పడింది, కాబట్టి ఇతడు జీవితాంతం నాకు సేవకునిగా ఉంటాడు” అని అనుకున్నాడు.

  5. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని తమ సైన్యాలను సమకూర్చుకున్నారు. ఆకీషు దావీదుతో, “నీవు, నీ మనుష్యులు నాతో పాటు యుద్ధానికి రావాలని నీవు గ్రహించాలి” అన్నాడు.

  6. అందుకు దావీదు, “నీ సేవకుడు ఏమి చేయగలడో నీవు చూస్తావు” అన్నాడు. ఆ మాటకు జవాబుగా ఆకీషు, “చాలా మంచిది, అప్పుడు నిన్ను జీవితాంతం నా అంగరక్షకునిగా నియమిస్తాను” అన్నాడు.

  7. యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు.

  8. ఫిలిష్తీయుల రాజులు తమ సైన్యాలతో వందమంది చొప్పున వెయ్యిమంది చొప్పున వస్తుండగా దావీదు అతని మనుష్యులు ఆకీషుతో కలసి సైన్యం వెనుక వస్తున్నారు.

  9. ఫిలిష్తీయుల సేనాధిపతులు, “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అందుకు ఆకీషు, “ఇతడు ఇశ్రాయేలు రాజైన సౌలు యొక్క అధికారియైన దావీదు కాదా? ఇతడు ఇప్పటికే ఒక సంవత్సరం పాటు నాతో ఉన్నాడు ఇతడు సౌలును విడిచిపెట్టిన రోజు నుండి ఇప్పటివరకు, నేను ఇతనిలో ఎటువంటి తప్పును చూడలేదు” అని వారికి జవాబిచ్చాడు.

  10. “ ‘సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు’ అని వారు నాట్యం చేస్తూ పాటలు పాడింది ఈ దావీదు గురించే కాదా?” అని అతనితో అన్నారు.

  11. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.

  12. అందుకు దావీదు ఆకీషుతో, “కానీ నేను ఏమి చేశాను? నేను మీ దగ్గరకు వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నీ సేవకునికి వ్యతిరేకంగా నీకు ఏమి దొరికింది? నేను వెళ్లి నా ప్రభువైన రాజు శత్రువులతో ఎందుకు పోరాడలేను?”

  13. అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.

  14. కాబట్టి దావీదు అతని మనుష్యులు ఉదయం త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు, మరోవైపు ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు వెళ్లారు.

  15. దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.

  16. దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు.

  17. ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు.

  18. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు.

  19. అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

  20. తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు.

  21. అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.

  22. కాబట్టి దావీదు అతనితో ఉన్న ఆరువందలమంది బయలుదేరి బెసోరు వాగు దగ్గరకు రాగా వారిలో రెండువందలమంది వెనుక ఉండిపోయారు.

  23. ఆ రెండువందలమంది అలసిపోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు కానీ దావీదు నాలుగువందలమంది ఇంకా తరుముతూ వెళ్లారు.

  24. పొలంలో ఒక ఈజిప్టువాడు కనబడగా వారు అతన్ని దావీదు దగ్గరకు తీసుకువచ్చి వానికి త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఇచ్చారు.

  25. అప్పుడు దావీదు, “నీది ఏ దేశం? ఎక్కడ నుండి వచ్చావు?” అని అతన్ని అడిగాడు. అందుకు అతడు, “ఈజిప్టుకు చెందిన నేను ఒక అమాలేకీయునికి బానిసను. మూడు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేదని నా యజమాని నన్ను వదిలేశాడు.