కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు.

  2. అతడు సౌలుతో ఇలా అన్నాడు, “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు?

  3. దావీదు ఇలా చెప్పడం ముగించినప్పుడు సౌలు, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు,

  4. అతడు దావీదుతో, “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను.

  5. అప్పుడు దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత సౌలు ఇంటికి తిరిగి వచ్చాడు; దావీదు అతని ప్రజలు తామున్న కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు.

  6. కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.

  7. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని,

  8. దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.

  9. నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”

  10. దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.

  11. నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.

  12. దావీదు సేవకులు వచ్చిన దారినే తిరిగివెళ్లి నాబాలు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పారు.

  13. అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.

  14. సేవకులలో ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో, “అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి శుభాలు చెప్పమని దూతలను పంపితే అతడు వారిని అవమానించి మాట్లాడాడు.

  15. ఆమె తన గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా, దావీదు అతని మనుష్యులు ఆమెకు ఎదురువచ్చారు. అప్పుడు ఆమె వారిని కలిసింది.

  16. అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు.

  17. రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.

  18. అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది.

  19. అందుకు దావీదు అబీగయీలుతో, “నన్ను కలుసుకోడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక.

  20. తర్వాత దావీదు తన కోసం ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతితో తీసుకుని, “నీ మాటలు నేను విని నీ మనవి అంగీకరించాను, సమాధానంతో ఇంటికి వెళ్లు” అని ఆమెతో చెప్పాడు.

  21. నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, “నాబాలు నా పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు నా పక్షాన పగతీర్చుకున్న యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆయన తన సేవకుడు తప్పు చేయకుండ కాపాడాడు, నాబాలు చేసిన తప్పును అతని తలపైకి తెచ్చాడు” అని అన్నాడు. తర్వాత దావీదు తనను పెండ్లి చేసుకోమని అబీగయీలును అడగడానికి ఆమె దగ్గరకు కబురు పంపించాడు.

  22. దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు దగ్గరకు వచ్చి, “దావీదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు” అని చెప్పారు.

  23. వెంటనే అబీగయీలు లేచి గాడిద మీద తన అయిదుగురు సేవకురాళ్లను వెంటబెట్టుకుని దావీదు దూతలతో వెళ్లి దావీదును పెళ్ళి చేసుకుంది.

  24. దావీదు యెజ్రెయేలుకు చెందిన అహీనోయమును కూడా పెళ్ళి చేసుకున్నాడు, వారిద్దరు అతని భార్యలు.

  25. అయితే సౌలు తన కుమార్తె దావీదు భార్యయైన మీకాలును గల్లీముకు చెందిన లాయిషు కుమారుడైన పల్తీయేలుకు ఇచ్చాడు.